Skip to main content

Chhattisgarh: ఇటీవల కన్నుమూసిన మావోయిస్టు పార్టీ అగ్రనేత?

Ramakrishna alias RK

మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ సాకేత్‌ అలియాస్‌ రామకృష్ణ అలియాస్‌ ఆర్కే(66) మృతి చెందారు. అనారోగ్యం, కిడ్నీలు విఫలమైన కారణంగా అక్టోబర్‌ 14న ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లాలోని దక్షిణ బస్తర్‌ అటవీప్రాంతంలో కన్నుమూశారు. గుంటూరు జిల్లా రెంటచింతల మండలం తుమృకోటకు చెందిన ఆర్కే దేశంలోనే మావోయిస్టు కీలక అగ్రనేతల్లో ఒకరుగా గుర్తింపు పొందారు.

ప్రభుత్వంతో చర్చలు...

1975లో పీపుల్స్‌వార్‌ ఉద్యమం వైపు ఆకర్షితులైన ఆర్కే... నాలుగు దశాబ్దాల ఉద్యమ జీవితంలో ప్రధానంగా నల్లమల, ఆంధ్ర–ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లను కేంద్రస్థానాలుగా చేసుకుని పీపుల్స్‌వార్‌/మావోయిస్టు పార్టీని బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించారు. పీపుల్స్‌వార్, మావోయిస్టు కమ్యూనిస్ట్‌ సెంటర్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీసీఐ) పార్టీలు విలీనమై 2004లో మావోయిస్టు పార్టీగా ఆవిర్భవించడంలో కీలకంగా వ్యవహరించారు. ఏవోబీ కార్యదర్శిగా, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేశారు. 2004లో అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంతో చర్చలు జరిపిన మావోయిస్టు ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించారు.

 

రూ.కోటిన్నరకుపైగా రివార్డు

దేశవ్యాప్తంగా దాదాపు 200కిపైగా కేసుల్లో నిందితుడైన ఆర్కేపై పలు రాష్ట్రాల్లో రివార్డులున్నాయి. మొత్తంగా రూ.1.52 కోట్ల రివార్డు ఉంది. 2003లో అలిపిరిలో అప్పటి  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై క్లెమోర్‌మైన్స్‌తో దాడి కేసు కూడా ఆయనపై ఉంది.
 

చ‌ద‌వండి: డబ్ల్యూహెచ్‌ఓ సాగో బృందంలో చోటు దక్కించుకున్న భారతీయుడు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు కన్నుమూత
ఎప్పుడు : అక్టోబర్‌ 14
ఎవరు    : అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ సాకేత్‌ అలియాస్‌ రామకృష్ణ అలియాస్‌ ఆర్కే(66)
ఎక్కడ    : దక్షిణ బస్తర్‌ అటవీప్రాంతం, బీజాపూర్‌ జిల్లా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం
ఎందుకు : కిడ్నీలు విఫలమైన కారణంగా...

 

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 16 Oct 2021 04:21PM

Photo Stories