Covid-19: డబ్ల్యూహెచ్‌ఓ సాగో బృందంలో చోటు దక్కించుకున్న భారతీయుడు?
భూగోళాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మూలాలను కనుక్కొనేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) మరోసారి గట్టి ప్రయత్నం చేస్తోంది. ఈ వైరస్ చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచి లీకయిందా? లేక సహజ సిద్ధంగానే సంక్రమించిందా? అన్న దిశగా ఇప్పటి వరకు జరిపిన విచారణ అసంపూర్తిగా ముగిసిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలో వివిధ వైరస్‌ల గుట్టుని నిగ్గు తేల్చడానికి 25 మందితో కూడిన శాస్త్రవేత్తల బృందాన్ని డబ్ల్యూహెచ్‌ఓ ఏర్పాటు చేసింది. డబ్ల్యూహెచ్‌ఓ సైంటిఫిక్ అడ్వైజరీ గ్రూప్ ఫర్ ది ఆరిజన్స్ ఆఫ్ నోవెల్ పాథోజెన్స్(ఎస్‌ఏజీవో–సాగో) అని పిలిచే ఈ ప్రతిపాదిత బృందంలో ఒక భారతీయ శాస్త్రవేత్త డాక్టర్ రామన్ గంగఖేడ్కర్‌తో సహా గత బృందంలో సభ్యులుగా ఉండి, చైనాలో పర్యటించిన ఆరుగురు శాస్త్రవేత్తలకు కూడా చోటు లభించింది.
డాక్టర్ రామన్ గంగఖేడ్కర్
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నుంచి 2020 ఏడాది పదవీ విరమణ పొందిన శాస్త్రవేత్త డాక్టర్ రామన్‌కు అంటువ్యాధుల వ్యాప్తిని అరికట్టే నిపుణుడిగా పేరుంది. ఐసీఎంఆర్‌లో పనిచేస్తూ రెండేళ్ల పాటు నిఫా వైరస్, కరోనా వైరస్‌లను ఎదుర్కోవడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. హెచ్‌ఐవీ–ఎయిడ్స్‌పై ఆయన చేసిన పరిశోధనలకు గాను పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.
చదవండి: స్టూడెంట్ ప్రైజ్ జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయురాలు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : 25 మందితో కూడిన బృందం సైంటిఫిక్ అడ్వైజరీ గ్రూప్ ఫర్ ది ఆరిజన్స్ ఆఫ్ నోవెల్ పాథోజెన్స్(ఎస్‌ఏజీవో–సాగో)లో చోటు దక్కించుకున్న భారతీయుడు?
ఎప్పుడు : అక్టోబర్ 14
ఎవరు : డాక్టర్ రామన్ గంగఖేడ్కర్
ఎందుకు : భూగోళాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మూలాలను కనుక్కొనేందుకు...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్