Global Student Prize 2021: స్టూడెంట్ ప్రైజ్ జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయురాలు?
ప్రతిష్టాత్మక ‘గ్లోబల్ స్టూడెంట్ ప్రైజ్–2021’ టాప్–10 ఫైనలిస్టుల జాబితాలో భారత విద్యార్థిని సీమా కుమారి(18)కి చోటు లభించింది. విజేతకు లక్ష డాలర్ల నగదు బహుమతి లభించనుంది. ప్రతిభా పాటవాలతో సమాజంపై ప్రభావం చూపిన వారిని గ్లోబల్ స్టూడెంట్ ప్రైజ్‌తో సత్కరిస్తారు. చెగ్.ఓఆర్‌టీ వెబ్‌సైట్ వివిధ దశల్లో వడపోత అనంతరం తుది విజేతను నవంబర్ 10న ప్రకటించనున్నారు.
భారత్‌లోని జార్ఖండ్‌కు చెందిన సీమా కుమారి... అమెరికాలోని కేంబ్రిడ్జ్‌లోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతోంది. జార్ఖండ్‌లోని ఆమె స్వగ్రామంలో బాల్య వివాహాలు సర్వసాధారణం. తల్లిదండ్రులు తనకు చిన్నప్పుడే తలపెట్టిన వివాహాన్ని ధైర్యంగా ఎదిరించి, చదువుపై ఆసక్తితో పాఠశాలకు వెళ్లడం ప్రారంభించింది. ‘యువ’ అనే మహిళా సాధికారత సంఘం ప్రోత్సాహం, ఆర్థిక సాయంతో హార్వర్డ్ యూనివర్సిటీలో చేరింది.
చదవండి: రాష్ట్ర హైకోర్టు సీజేగా ప్రమాణం చేసిన న్యాయమూర్తి?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రతిష్టాత్మక ‘గ్లోబల్ స్టూడెంట్ ప్రైజ్–2021’ టాప్–10 ఫైనలిస్టుల జాబితాలో చోటు దక్కించుకున్న భారత విద్యార్థిని?
ఎప్పుడు : అక్టోబర్ 14
ఎవరు : సీమా కుమారి(18)
ఎందుకు : ప్రతిభా పాటవాలతో సమాజంపై ప్రభావం చూపినందున...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్