Sindhutai Sapkal: ప్రముఖ సామాజిక వేత్త, పద్మ శ్రీ అవార్డీ కన్నుమూత
అనాథ పిల్లల అమ్మ(మదర్ ఆఫ్ ఆర్ఫన్స్)గా పేరొందిన ప్రముఖ సామాజిక కార్యకర్త, పద్మ శ్రీ అవార్డు గ్రహీత సింధుతాయి సప్కాల్ (73) ఇక లేరు. గుండెనొప్పి కారణంగా పూణెలోని గ్యాలక్సీ కేర్ ఆసుపత్రిలో జనవరి 4న తుదిశ్వాస విడిచారు. 1948, నవంబర్ 14న మహారాష్ట్ర రాష్ట్రం, వార్ధా జిల్లా, వార్థాలో జన్మించిన సింధుతాయి జీవితంలో ఎన్నో కష్టాలకు ఎదురీది అనాథ పిల్లల కోసం పలు సంస్థలను ఏర్పాటు చేశారు. 1,050 మంది అనాథలను పెంచి పెద్ద చేశారు. ఆమె సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2021లో పద్మ శ్రీ అవార్డుతో సత్కరించింది. ఈమె జీవిత చరిత్ర మరాఠా భాషలో బయోపిక్ చిత్రంగా వచ్చింది.
రంజీ ట్రోఫీ వాయిదా
కరోనా వైరస్ మళ్లీ విజృంభించడంతో 2022, జనవరి 13న ప్రారంభానికి సిద్ధమైన రంజీ ట్రోఫీ సహా, సీకే నాయుడు ట్రోఫీ, సీనియర్ మహిళల టి20 లీగ్ టోర్న మెంట్లను వాయిదా వేస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి ఒక ప్రకటనలో తెలిపింది. టోర్నమెంట్‌లను తిరిగి ఎప్పుడు నిర్వహించేది కేసుల తీవ్రత, అనుకూల పరిస్థితులను బట్టి నిర్ణయిస్తామని పేర్కొంది.
చదవండి: ఓఎన్‌జీసీ సీఎండీగా నియమితుతలైన తొలి మహిళ?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రముఖ సామాజిక వేత్త, పద్మ శ్రీ అవార్డీ కన్నుమూత
ఎప్పుడు : జనవరి 4
ఎవరు : సింధుతాయి సప్కాల్ (73)
ఎక్కడ : పూణె, పూణె జిల్లా, మహరాష్ట్ర
ఎందుకు : గుండెనొప్పి కారణంగా..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్