United Nations: ఐరాస భారత శాశ్వత ప్రతినిధిగా రుచిరా కాంబోజ్
ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా సీనియర్ దౌత్యవేత్త రుచిరా కాంబోజ్ నియమితులయ్యారు. 1987 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి అయిన రుచిరా ప్రస్తుతం భూటాన్ లో భారత రాయబారిగా పనిచేస్తున్నారు. భూటాన్ కు భారత మొదటి మహిళా రాయబారిగా రుచిరా నిలిచారు. ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా పనిచేసిన టి.ఎస్.తిరుమూర్తి స్థానాన్ని కాంబోజ్ భర్తీ చేయనున్నారు.
ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము
రాష్ట్రపతి ఎన్నికలకు ఎన్‌డీఏ అభ్యర్థిగా ఝార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్మును భాజపా ప్రకటించింది. ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లా బైడపోసిలో ద్రౌపది ముర్ము జన్మించారు. రాజకీయాల్లోకి రాకముందు టీచర్‌గా పనిచేశారు. 2000–2004 వరకు ఒడిశా అసెంబ్లీలో ఎమ్మెల్యేగా,మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత ఝార్ఖండ్ గవర్నర్‌గా పనిచేశారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP