Russian Journalist Sells Nobel Prize: ఉక్రెయిన్ చిన్నారుల కోసం.. నోబెల్ బహుమతిని వేలానికి పెట్టిన రష్యాన్ జర్నలిస్ట్
Sakshi Education
- ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా నిరాశ్రయులైన చిన్నారుల సహాయార్థం రష్యాన్ జర్నలిస్ట్ డిమిత్రి మురాటోవ్ తనకు లభించిన నోబెల్ బహుమతిని విక్రయించారు. ఆయన 1999లో స్థాపించబడిన నోవాయా వార్తాపత్రిక సంపాదకుడు. ఈ మేరకు డిమిత్రి మురాటోవ్ తన నోబెల్ శాంతి బహుమతిని ప్రపంచ శరణార్థుల దినోత్సవం రోజున వేలం నిర్వహించారు. ఐతే ఊహించని రీతిలో మురాటోవో నోబెల్ బహుమతి మరే ఏ ఇతర నోబెల్ బహుమతులు సాధించిన విధంగా వేలంలో రికార్డు స్థాయిలో అత్యధిక ధర పలికింది.
- హెరిటేజ్ వేలం కంపెనీ ఈ నోబెల్ ప్రైజ్ వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని నిరాశ్రయులైన పిల్లల కోసం కృషి చేస్తున్న యూనిసెఫ్ అందజేస్తామని స్పష్టం చేసింది. ఐతే మురాటోవ్ 2021లో ఫిలిఫ్పీన్స్‌కు చెందిన మరియా రెస్సాతో కలసి ఈ నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. రష్యా అధ్యక్షుడి పుతిన్ 1999 నుంచి మీడియా సంస్థలపై ఉక్కుపాదం మోపి కట్టడి చేస్తూ వస్తున్నాడు. ఎప్పుడైతే రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఉక్రెయిన్‌పై దురాక్రమణ యుద్ధానికి దిగాడో అప్పటి నుంచి రష్యాలోని మీడియా సంస్థలపై మరింత ఒత్తిడి పెంచాడు. ఈ క్రమంలో మురాటోవో గెజిటా వార్తాపత్రిక ఉక్రెయిన్‌లో యుద్ధం విషయమై రష్యా దుశ్చర్యను ఎండగడుతూ రాసింది.
- అంతే పుతిన్ ప్రభుత్వం వరుస హెచ్చరికలను జారీ చేసి తదనంతరం పూర్తిగా ఆ పత్రిక కార్యకలాపాలను నిలిపేసింది. అంతేకాదు మురాటోవా పై ఎరుపురంగుతో దాడి చేశారు. కానీ మాస్కో మాత్రం ఈ యుద్ధాన్ని భద్రతా దృష్ట్యా సాగిస్తున్న ప్రత్యేక సైనిక చర్యగా చెప్పుకుంటూ రష్యా ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించింది. ఐతే పాశ్చాత్య దేశాలు దీన్ని దురాక్రమణ యుద్ధంగా గొంతెత్తి చెప్పాయి. ఈ మేరకు మురాటోవో మాట్లాడుతూ...తన సిబ్బంది మద్దతుతో ఈ వేలం నిర్వహించినట్ల తెలిపారు. ఈ వేలం ద్వారా వచ్చిన మొత్తం ఉక్రెయిన్ శరణార్థుల జీవితాలకు ప్రయోజనకరంగా ఉండాలని ఆశిస్తున్నానని చెప్పారు.
- Download Current Affairs PDFs: Click Here
- యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్
Published date : 21 Jun 2022 06:02PM