Skip to main content

CEC of India: ఎన్నికల ప్రధాన అధికారిగా రాజీవ్‌ కుమార్‌

CEC of India: భారత ఎన్నికల ప్రధాన అధికారిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
Rajiv Kumar takes charge as 25th Chief Election Commissioner of India
Rajiv Kumar takes charge as 25th Chief Election Commissioner of India

భారత ఎన్నికల ప్రధాన అధికారి (చీఫ్‌ ఎలక్షన్ కమిషనర్‌–సీఈసీ)గా రాజీవ్‌ కుమార్‌ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఉన్న సుశీల్‌ చంద్ర స్థానంలో ఆయన నియమితులయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘంలోని కమిషనర్లలో సీనియర్‌ను ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమించడం ఆనవాయితీ. దీనిని అనుసరించి రాజీవ్‌ కుమార్‌ను ఇటీవల రాష్ట్రపతి సీఈసీగా నియమించారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2025 ఫిబ్రవరి వరకు రాజీవ్‌ సీఈసీగా ఉంటారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలతోపాటు 2024లో సార్వత్రిక ఎన్నికలు కూడా ఆయన సారథ్యంలోనే జరగనున్నాయి.

Andhra Pradesh: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా ఎవరు నియమితులయ్యారు?

త్రిపుర కొత్త సీఎంగా డాక్టర్‌ మాణిక్‌ సాహా 
త్రిపుర కొత్త సీఎంగా డాక్టర్‌ మాణిక్‌ సాహా(69)ప్రమాణ స్వీకారం చేసారు. రాజకీయాల్లోకి రాకముందు త్రిపుర మెడికల్‌ కాలేజీలో డెంటల్‌ ఫ్యాకల్టీగా పనిచేశారు.

యూఏఈ నూతన అధ్యక్షుడిగా షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ 
యునైటెడ్‌ అరబ్‌ ఎమిరెట్స్‌కు కొత్త అధ్యక్షుడిగా అబుదాబి క్రౌన్‌ ప్రిన్స్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ నియమితులయ్యారు. ఈ విషయాన్ని అక్కడి మీడియా అధికారికంగా ప్రకటించింది. అనారోగ్య సమస్యలతో యూఏఈ అధ్యక్షుడు షేక్‌ ఖలీఫా ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సోదరుడు షేక్‌ మొహమ్మద్‌ బిన్ జాయెద్‌ను యూఏఈ అధ్యక్షుడిగా ప్రకటించారు.

Election Commission: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఎవరు నియమితులయ్యారు?​​​​​​​

Published date : 24 May 2022 06:50PM

Photo Stories