Boora Rajeshwari: కాళ్లతోనే కవిత్వం రాసిన కవయిత్రి కన్నుమూత
Sakshi Education
కాళ్లతో కవిత్వం రాసిన కవయిత్రి బూర రాజేశ్వరి (42) డిసెంబర్ 28న చికిత్స పొందుతూ మృతి చెందారు.
వైకల్యంతో జన్మించిన ఆమె శరీరం సహకరించకపోయినా కాళ్లతోనే భావాలను అక్షరీకరించింది. ఐదు వందలకు పైగా రాసిన కవితలను సుద్దాల అశోక్ తేజ పుస్తకంగా అచ్చువేయించారు. రాజేశ్వరి దీనస్థితిని, కాళ్లతోనే కవిత్వం రాసే స్ఫూర్తికి ప్రభావితమైన మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడి పాఠ్యాంశాల్లో ఆమె జీవితగాథను చేర్చింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, మంత్రి కేటీఆర్ సైతం ప్రత్యేక చొరవ తీసుకుని రూ.10 లక్షలను ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయించారు. దీనిపై వచ్చే రూ.10 వేల వడ్డీని నెలవారీ పింఛనుగా ఇస్తున్నారు. చిన్నప్పటి నుంచి తన ఆలనాపాలనా చూసిన తల్లి అనసూర్య రెండేళ్ల క్రితం కరోనాతో మరణించింది. నాలుగు నెలల క్రితం డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరైంది.
Chalapathi Rao: విలక్షణ నటుడు చలపతిరావు కన్నుమూత
Published date : 29 Dec 2022 12:36PM