Hurun Research Institute: అత్యంత దనవంతుల జాబితాలో చోటు దక్కించుకున్న మహిళ?
ప్రపంచంలో స్వయంకృషితో ఎదిగిన 10 మంది అగ్రగామి మహిళల్లో సౌందర్య, సంరక్షణ ఉత్పత్తుల ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ ‘నైకా’ వ్యవస్థాపకురాలు ఫాల్గుణి నాయర్ చోటు సంపాదించారని హురున్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వెల్లడించింది. ఈ మేరకు ‘‘హురున్ రిచెస్ట్ సెల్ఫ్–మేడ్ వుమెన్ ఇన్ ద వరల్డ్–2022’’ జాబితాను విడుదల చేసింది. ఫాల్గుణి 7.6 బిలియన్ డాలర్ల (సుమారు రూ.57,000 కోట్ల) సంపదతో ఈ జాబితాలో స్థానం సాధించినట్లు పేర్కొంది. అలాగే టాప్–10 మహిళల్లో స్థానం పొందిన ఏకైక భారతీయురాలిగా నిలిచింది.
Real Estate Rich List: రియల్ ఎస్టేట్‌లో అత్యంత సంపన్నుడిగా నిలిచిన వ్యక్తి?
జాబితాలో భారత్ నుంచి ఫాల్గుణి కాకుండా.. రాధా వెంబు (3.9 బిలియన్ డాలర్లు) 25వ స్థానంలో, బయోకాన్ చైర్ పర్సన్ కిరణ్ మజుందార్ షా 26వ స్థానంలో నిలిచారు. రాధా వెంబు.. తన సోదరుడితో కలిసి ’జోహో’ సంస్థను ఏర్పాటు చేశారు. హురున్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ విడుదల చేసిన తాజా జాబితాలో మొత్తం 16 దేశాలకు చెందిన 124 మంది మహిళా బిలియనీర్లు ఉన్నారు.
USA: మిల్కెన్ ఇన్‌స్టిట్యూట్ వార్షిక సదస్సులో ప్రసగించనున్న మంత్రి?
క్విక్ రివ్యూ :
ఏమిటి : హురున్ రిచెస్ట్ సెల్ఫ్–మేడ్ వుమెన్ ఇన్ ద వరల్డ్–2022 జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయులు?
ఎప్పుడు : ఏప్రిల్ 06
ఎవరు : ఫాల్గుణి నాయర్, కిరణ్ మజుందార్ షా, రాధా వెంబు
ఎందుకు : స్వయంకృషితో బిలియనీర్లుగా ఎదిగినందున..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్