USA: మిల్కెన్ ఇన్‌స్టిట్యూట్ వార్షిక సదస్సులో ప్రసగించనున్న మంత్రి?
అమెరికాలోని లాస్ ఏంజెలిస్‌లో ఉన్న బెవర్లీ హిల్టన్ వేదికగా ‘‘మిల్కెన్ ఇన్‌స్టిట్యూట్ 25వ ప్రపంచ వార్షిక సదస్సు’’ను నిర్వహించనున్నారు. వివిధ రంగాలు, సరిహద్దులు, రాజకీయ గ్రూపులను అనుసంధానించాల్సిన ఆవసరాన్ని గుర్తుచేస్తూ ‘సెలబ్రేటింగ్ పవర్ ఆఫ్ కనెక్షన్’అనే అంశంపై సదస్సు జరగనుంది. ఆర్థిక, ప్రభుత్వ, ఆరోగ్యరం గాలతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ప్రసంగించే ఈ సదస్సుకు ప్రపంచం నలుమూలల నుంచి 3 వేల మందికిపైగా ప్రతి నిధులు వర్చువల్ విధానంలో హాజరవుతారు. 2022, మే 1 నుంచి 4 వరకు జరిగే ఈ సదస్సులో ప్రసంగించాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావుకు ఆహ్వానం అందింది. కరోనా సంక్షోభం నుంచి కోలుకుంటున్న ప్రస్తుత సమయంలో ప్రపంచం పరివర్తన చెందాల్సిన తీరుపై వక్తలు ప్రసంగిస్తారని మిల్కెన్ ఇన్‌స్టిట్యూట్ సీఈఓ మైఖేల్ ఎల్ క్లౌడెన్ కేటీఆర్‌కు పంపిన ఆహ్వానంలో పేర్కొన్నారు.
IndiGo New CFO: ఇండిగో సీఎఫ్‌వోగా ఎవరు నియమితులయ్యారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2022, మే 1 నుంచి 4 వరకు జరిగే మిల్కెన్ ఇన్‌స్టిట్యూట్ 25వ ప్రపంచ వార్షిక సదస్సులో ప్రసగించనున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి?
ఎప్పుడు : ఏప్రిల్ 01
ఎవరు : తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు
ఎక్కడ : బెవర్లీ హిల్టన్, లాస్ ఏంజెలిస్, అమెరికా
ఎందుకు : మిల్కెన్ ఇన్‌స్టిట్యూట్ సీఈఓ మైఖేల్ ఎల్ క్లౌడెన్ కేటీఆర్‌కు పంపిన ఆహ్వానం మేరకు..
FedEx: ఫెడ్‌ఎక్స్ సీఈవోగా నియమితులైన భారతీయ అమెరికన్?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్