FedEx: ఫెడ్‌ఎక్స్ సీఈవోగా నియమితులైన భారతీయ అమెరికన్?
కొరియర్ సేవల్లో ఉన్న యూఎస్ దిగ్గజం ఫెడ్‌ఎక్స్ నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో)గా భారతీయ అమెరికన్ రాజ్ సుబ్రమణ్యం నియమితులయ్యారు. చైర్మన్, సీఈవోగా ఉన్న ఫ్రెడరిక్ డబ్ల్యూ స్మిత్ స్థానాన్ని ఆయన భర్తీ చేస్తారని మార్చి 29న సంస్థ వెల్లడించింది. 2022 జూన్ 1న స్మిత్ ఈ పదవి నుంచి వైదొలగనున్నారు. సుబ్రమణ్యం ప్రస్తుతం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఉన్నారు. 1991 ఏడాదిలో ఫెడ్‌ఎక్స్‌లో చేరిన సుబ్రమణ్యం 2020లో బోర్డులో చేరారు. ఫెడ్‌ఎక్స్ కార్పొరేషన్ ప్రెసిడెంట్, సీవోవో బాధ్యతలకు ముందు ఆయన ఫెడ్‌ఎక్స్ ఎక్స్‌ప్రెస్ ప్రెసిడెంట్, సీఈవోగా పనిచేశారు. స్మిత్ 1971లో ఫెడ్‌ఎక్స్ స్థాపించారు. ప్రపంచవ్యాప్తంగా సంస్థలో 6,00,000పైగా ఉద్యోగులు ఉన్నారు. అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రంలో ఉన్న మెంఫిస్ నగరంలో ఫెడ్‌ఎక్స్ ప్రధాన కార్యాలయం ఉంది.
Pakistan: అవిశ్వాసాన్ని ఎదుర్కొంటున్న మూడో ప్రధాని ఎవరు?
Celebrity Brand Valuation: భారత్‌లో అత్యంత విలువైన సెలబ్రిటీగా నిలిచిన వ్యక్తి?
క్విక్ రివ్యూ :
ఏమిటి : యూఎస్ దిగ్గజం ఫెడ్‌ఎక్స్ నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో)గా నియమితులైన వ్యక్తి?
ఎప్పుడు : మార్చి 31
ఎవరు : భారతీయ అమెరికన్ రాజ్ సుబ్రమణ్యం
ఎక్కడ : మెంఫిస్ నగరం, టెన్నెస్సీ, అమెరికా