Skip to main content

Pakistan New PM : పాక్‌ కొత్త ప్రధాని ఈయ‌నే.. ఏకగ్రీవంగా ఎన్నిక

పాకిస్థాన్‌ కొత్త ప్రధాన మంత్రిగా షెహబాజ్‌ షరీఫ్‌ ఎన్నికయ్యారు. ప్రతిపక్ష పీఎంఎల్‌-ఎన్‌ నేత అయిన 70 ఏళ్ల షెహబాజ్‌.. పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ సోదరుడు కూడా.
Shehbaz Sharif
Pakistan Prime Minister Shehbaz Sharif

ప్రధాని ఎన్నిక కోసం.. ఏప్రిల్ 11వ తేదీన‌(సోమవారం) నేషనల్‌ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అయ్యింది. గత అధికార పార్టీ తెహ్రీక్‌ ఇ ఇన్సాఫ్‌ (పీటీఐ) సభ్యుల రాజీనామాతో ఏర్పడిన ప్రతిష్టంబనను తొలగించేందుకు ఓటింగ్‌ నిర్వహించింది. ఈ ఓటింగ్‌లో షెహబాజ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

పాక్‌ ప్రధాని రేసు కోసం పీటీఐ నుంచి షా మహమ్మద్‌ ఖురేషీ, షెహబాజ్‌ షరీఫ్‌ ఇద్దరూ పోటీపడ్డారు. అయితే పీటీఐ సభ్యుల మూకుమ్మడి రాజీనామాతో ప్రభుత్వం కుప్పకూలగా.. ఖురేషీ అభ్యర్థిత్వానికి బలం లేకుండా పోయింది. ఇదిలా ఉంటే.. షెహబాజ్‌ షరీఫ్‌ 2018లో నేషనల్‌ అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

రాజకీయ చరిత్రలో తొలిసారిగా..
పాకిస్థాన్‌ రాజకీయ చరిత్రలో తొలిసారిగా.. ఒక ప్రధానిని అవిశ్వాస తీర్మానంతో గద్దె దించారు. 174 ఓట్లతో ఇమ్రాన్‌ ఖాన్‌ను ప్రధాని పదవి నుంచి దింపేశారు.

Supreme Court of Pakistan: ఈ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం

Pakistan: అవిశ్వాసాన్ని ఎదుర్కొంటున్న మూడో ప్రధాని ఎవరు?​​​​​​​

Published date : 11 Apr 2022 06:31PM

Photo Stories