Supreme Court of Pakistan: ఈ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం
డిప్యూటీ స్పీకర్ రూలింగ్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 95ను ఉల్లంఘించేలా ఉందని ఆక్షేపించింది. దీంతో ఇమ్రాన్ అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవాలి్సన పరిస్థితి కనిపిస్తోంది. డిప్యూటీ స్పీకర్ చర్య రాజ్యాంగ విరుద్ధమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉమర్ అతా బందియాల్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తేల్చిచెప్పింది. పార్లమెంట్‌ను రద్దు చేయాలంటూ ప్రధాని ఇమ్రాన్ అధ్యక్షుడు అరీఫ్ అల్వీకి సిఫార్సు చేయడం రాజ్యాంగ విరుద్ధమేనని స్పష్టం చేసింది. అంతా రాజ్యాంగం ప్రకారమే జరిగితే సంక్షోభానికి తావే ఉండదని వివరించింది. పాక్ పార్లమెంట్‌ను పునరుద్ధరిస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 9వ తేదీన జాతీయ అసెంబ్లీ సమావేశం నిర్వహించాలని స్పీకర్‌ను ఆదేశించింది. ఇమ్రాన్‌పై అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించాలని పేర్కొంది. పార్లమెంట్ రద్దుపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చుట్టుపక్కల పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. పాకిస్తాన్ ముస్లింలీగ్–నవాజ్ పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత షెహబాజ్ షరీఫ్ ధర్మాసనం ఎదుట తన వాదనలు వినిపించారు. తమపై కుట్రదారులుగా ముద్రవేశారని, అలాంటప్పుడు ఎన్నికల్లో ఎలా పాలుపంచుకుంటామని ప్రశ్నించారు. ఇమ్రాన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ఏప్రిల్ 3న డిప్యూటీ స్పీకర్ రద్దు చేసిన సంగతి తెలిసిందే.
Pakistan: అవిశ్వాసాన్ని ఎదుర్కొంటున్న మూడో ప్రధాని ఎవరు?