Maharashtra: రాష్ట్ర మైనార్టీ వ్యవహారాల మంత్రిని ఏ కేసులో అరెస్టు చేశారు?
మహారాష్ట్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి, ఎన్‌సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్‌ను అక్రమార్జన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఫిబ్రవరి 23న అరెస్టు చేసింది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో భాగంగా మాలిక్‌ను అరెస్టు చేశారు. దక్షిణ ముంబైలోని ఈడీ కార్యాలయానికి మాలిక్‌ను ఈడీ అధికారులు తీసుకొచ్చారు. దావూద్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దాఖలు చేసిన ఒక ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ మాలిక్‌పై కేసు నమోదు చేసింది.
ప్రముఖ సాహితీవేత్త గురుప్రసాదరావు కన్నుమూత
ప్రముఖ సాహితీవేత్త, పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ నాగళ్ల గురుప్రసాదరావు(89) ఫిబ్రవరి 21న విజయవాడలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. గుంటూరు జిల్లా కావూరులో జన్మించిన ఆయన.. తాడికొండ, గుంటూరు, విజయవాడలలో తెలుగు అధ్యాపకుడిగా వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దారు. రెండు వేలకు పైగా సాహిత్య వ్యాసాలను తెలుగు వారికి అందించారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర సాహిత్య అకాడమీ 2017లో భాషా సమ్మాన్ పురస్కారంతో సత్కరించింది. సీఆర్ రెడ్డి స్మారక పురస్కారం, సుధీరత్న పురస్కారం, కేంద్ర సాంస్కృతిక శాఖ ఫెలోషిప్‌లను ఆయన అందుకున్నారు.
చదవండి: రాష్ట్ర ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్‌గా నియమితులైన అధికారి?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్