Skip to main content

Praveen Sood: సీబీఐ నూతన డైరెక్టర్‌గా ప్రవీణ్‌ సూద్ బాధ్యతలు

కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నూతన డైరెక్టర్‌గా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ప్రవీణ్‌ సూద్ మే 25న‌ బాధ్యతలు చేపట్టారు. ఆయన ఇంతకుముందు కర్ణాటక డీజీపీగా పనిచేశారు.
Senior IPS Officer Praveen Sood

సీబీఐ డైరెక్టర్‌ గురించి మరిన్ని విషయాలు
► 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్‌ సూద్‌, నిన్నటివరకు కర్ణాటక డీజీపీగా సేవలందించారు.
► సీబీఐ కొత్త డైరెక్టర్ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగుతారు. 
ప్రవీణ్ సూద్ ఐఐటీ ఢిల్లీలో ఇంజినీరింగ్ చదివారు. ఆ తర్వాత UPSC ద్వారా IPS సర్వీసులోకి వచ్చారు. 

► కర్ణాటక పోలీస్ శాఖలో పలు ఉన్నత పదవులు నిర్వహించారు. 
► 1989లో మైసూరు ఏఎస్పీగా బాధ్యతలు, అనంతరం బళ్లారి, రాయచూరు ఎస్పీగా, ఆ తర్వాత బెంగళూరు డీసీపీగా పని చేశారు.

Siddaramaiah: కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య.. ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌

► 1999లో డిప్యుటేషన్ మీద మారిషస్ లో మూడేళ్ల పాటు పనిచేశారు. 
► 2004-2007 మధ్య మైసూరు కమిషనర్ గా పని చేశారు.
► ఆ తర్వాత కర్ణాటక హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా, అడిషనల్ డీజీపీగా, రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ గానూ వ్యవహరించారు.

► ఢిల్లీ స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ 1946 కింద CBI (సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌) ఏర్పాటు అయింది కాబట్టి ఆ చట్టం 4A కింద డైరెక్టర్‌ బాధ్యతలు స్వీకరించారు.
► ప్రవీణ్‌ సూద్‌కు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. సూద్‌ అల్లుడే టీం ఇండియా క్రికెట్‌ బ్యాట్స్‌మన్‌ మయాంక్‌ అగర్వాల్‌.
► ప్రవీణ్‌ సూద్‌ పలు విశిష్ట పురస్కారాలు, అవార్డులు అందుకున్నారు. 

 

సంవత్సరం    పురస్కారం
1996               చీఫ్ మినిస్టర్ గోల్డ్ మెడల్
2002               పోలీస్ మెడల్
2006               ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్
2011               ప్రిన్స్ మైఖైల్ ఇంటర్నేషనల్ రోడ్ సేఫ్టీ అవార్డు
2011               నేషనల్ ఈ-గవర్నెన్స్ గోల్డ్ మెడల్

Justice Misra and Viswanathan: సుప్రీం జడ్జిలుగా జస్టిస్‌ పీకే మిశ్రా, కేవీ విశ్వనాథన్‌ ప్రమాణం

Published date : 26 May 2023 07:50AM

Photo Stories