Andhra Pradesh: రాష్ట్ర హైకోర్టు ఆర్‌జీగా నియమితులైన తొలి మహిళ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ డాక్టర్ కుంభజడల మన్మధరావు, జస్టిస్ బొడ్డుపల్లి శ్రీ భానుమతి నియమితులయ్యారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల చేసిన సిఫారసులకు రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. దీంతో కేంద్రం వీరి నియామకాలను నోటిఫై చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. త్వరలో వీరు న్యాయమూర్తులుగా ప్రమాణం చేయనున్నారు. వీరిద్దరి నియామకంతో ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 20కి చేరనుంది.
న్యాయమూర్తుల నేపథ్యం ఇది..
జస్టిస్ కుంభజడల మన్మధరావు
జననం: 1966, జూన్ 30
ఊరు: ప్రకాశం జిల్లా సింగరాయకొండ
విద్యాభ్యాసం: ఆంధ్రా యూనివర్సిటీ నుంచి
లా డిగ్రీ, డాక్టరేట్
ప్రస్థానం:
- 1991లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. ఒంగోలులో నాగిశెట్టి రంగారావు వద్ద వృత్తిలో మెళకువలు నేర్చుకున్నారు.
- 1999లో హైకోర్టుకు ప్రాక్టీస్ మార్చారు.
- ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), రెవెన్యూ ఇంటెలిజెన్స్ వంటి కీలక సంస్థలకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరించారు.
- పలు బ్యాంకులకు న్యాయ సలహాదారుగా ఉన్నారు.
జస్టిస్ బొడ్డుపల్లి శ్రీ భానుమతి(బీఎస్ భానుమతి)
స్వగ్రామం: పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు
విద్యాభ్యాసం: రాజమహేంద్రవరంలో ‘లా’ అభ్యసించారు.
ప్రస్థానం:
- న్యాయాధికారిగా ఉమ్మడి రాష్ట్రంలో పలు జిల్లాల్లో పనిచేశారు.
- 2020 జూన్‌లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ (ఆర్‌జీ)గా నియమితులయ్యారు. అప్పటి నుంచి అదే పోస్టులో కొనసాగుతున్నారు. రిజిస్ట్రార్ జనరల్ పోస్టులో ఓ మహిళ నియమితులు కావడం ఇదే తొలిసారి.
చదవండి: జన్ ధన్ ఖాతాల్లో మహిళా ఖాతాదారుల సంఖ్య ఎంత శాతం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 6
ఎవరు : జస్టిస్ డాక్టర్ కుంభజడల మన్మధరావు, జస్టిస్ బొడ్డుపల్లి శ్రీ భానుమతి
ఎందుకు : సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల చేసిన సిఫారసులకు రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేయడంతో..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్