AP High Court: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ అమానుల్లా ప్రమాణం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా అక్టోబర్ 10న ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిలోని హైకోర్టులో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ అమానుల్లాతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి ప్రమాణం చేయించారు. పాట్నా హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ అమానుల్లాను రాష్ట్ర హైకోర్టుకు బదిలీ చేస్తూ రాష్ట్రపతి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. పాట్నా హైకోర్టులో నాల్గవ స్థానంలో కొనసాగిన ఆయన... ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రెండవ స్థానంలో కొనసాగుతారు.
1963 మే 11న బీహార్‌లో జన్మించిన జస్టిస్ అమానుల్లా.. బీఎస్సీ ఎల్‌ఎల్‌బీ చదివారు. 1991 సెప్టెంబర్ 27న బీహార్ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదయ్యారు.అనేక అంచెలు దాటి 2011 జూన్ 20న పాట్నా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
ఎన్‌సీఎల్‌టీ సభ్యురాలిగా జస్టిస్ రజని
నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ), అమరావతి సభ్యురాలిగా ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజని నియమితులయ్యారు. అదేవిధంగా ఎన్‌సీఎల్‌టీ హైదరాబాద్ జ్యుడీషియల్ సభ్యుడిగా న్యాయవాది నందుల వెంకటరామకృష్ణ బద్రీనాథ్.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఈశాన్య రాష్ట్రాల డెట్ రికవరీ ట్రిబ్యునల్ న్యాయమూర్తి వేములపల్లి కిశోర్ ముంబై ఎన్‌సీఎల్‌టీ జ్యుడీషియల్ సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం అక్టోబర్ 10న నోటిఫికేషన్ విడుదల చేసింది.
చదవండి: తెలంగాణ హైకోర్టు సీజేగా నియమితులైన న్యాయమూర్తి?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం
ఎప్పుడు : అక్టోబర్ 10
ఎవరు : జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, అమరావతి, గుంటూరు జిల్లా
ఎందుకు : రాష్ట్రపతి ఉత్తర్వులు మేరకు...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్