Skip to main content

Mukhtar Ansari: గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ మృతి

గ్యాంగ్‌స్టర్‌, రాజకీయ నాయకుడు ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మరణించడం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.

మార్చి 28వ తేదీ బందా జిల్లా జైలులో ఆయన ఆరోగ్యం విషమించడంతో అధికారులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూనే ఆయన మరణించారు.  

అన్సారీ ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2005 నుంచి యూపీ, పంజాబ్‌ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు. ఈయనపై 60కి పైగా క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 2022 నుంచి యూపీలోని వివిధ కోర్టులో 8 కేసుల్లో తీర్పులు వెలువరించాయి.

అన్సారీ మరణంపై అనేక వివాదాలు తలెత్తాయి. జైలులో ఆయనపై విష ప్రయోగం జరిగిందని ఆయన సోదరుడు, ఘాజీపూర్‌ ఎంపీ అఫ్జల్‌ అన్సారీ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆరోపణలను ఖండించింది.

Abhay Thakur: మయన్మార్‌ రాయబారిగా అభయ్ ఠాకూర్

Published date : 29 Mar 2024 02:54PM

Photo Stories