Iran sentences women journalists: ఇరాన్‌లో మహిళా జర్నలిస్టులకు జైలు శిక్ష
Sakshi Education
ఇద్దరు మహిళా జర్నలిస్టులకు ఇరాన్ ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.
గతేడాది ఇరానీ మహిళ మహసా అమినీ కస్టడీ మరణం పెను సంచలనం సృష్టించడం, దాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగడం తెలిసిందే.
Gandhi Peace Prize: గాంధీ శాంతి పురస్కార గ్రహీత ఎంపిక కమిటీ సభ్యుడిగా మాజీ ఉపరాష్ట్రపతి
ఆ కస్టడీ మరణంపై రిపోర్టింగ్ చేసినందుకు సదరు మహిళా జర్నలిస్టులు ఆలాహే మొహమ్మది (36), నిలోఫర్ హమెదీ (31)లను దోషులుగా న్యాయ శాఖ నిర్ధారించింది. అలాహేకు ఆరు సంవత్సరాలు, హమెదీకి ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడింది. వారిద్దరూ 2022 సెప్టెంబర్ నుంచీ టెహ్రాన్‌లోని ఎవిన్ జైలులో మగ్గిపోతున్నారు. గత మే నెలలో వారిపై విచారణ మొదలైంది. తాజా తీర్పుపై వారు అప్పీల్‌కు వెళ్లేందుకు అవకాశం కల్పించామని న్యాయ శాఖ పేర్కొంది.
UN India's New ambassador: ఐక్యరాజ్యసమితి భారత ప్రతినిధిగా బాగ్చీ
Published date : 24 Oct 2023 11:35AM