Amit Kshatriya: నాసా ‘మూన్ టు మార్స్’ చీఫ్‌గా భారత సంతతి వ్యక్తి!
Sakshi Education
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ‘మూన్ టు మార్స్’ కార్యక్రమం హెడ్‌గా భారత సంతతికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, రోబోటిక్స్ ఇంజనీర్ అయిన అమిత్ క్షత్రియ నియమితులయ్యారు.
చంద్రుడిపై సుదీర్ఘ కాలం మకాం వేయడానికి, అక్కడి నుంచి అంగారక గ్రహంపైకి మనుషులను పంపే బృహత్తర లక్ష్యంతో నాసా ఈ మిషన్‌కు రూపకల్పన చేసింది. ‘మూన్ టు మార్స్’ కార్యక్రమానికి సారథ్యం వహించనున్న అమిత్ క్షత్రియ నాసా ఎక్స్‌ప్లోరేషన్ సిస్టమ్స్ డెవలప్‌మెంట్ మిషన్ డైరెక్టరేట్‌లో కొత్తగా ఏర్పాటయ్యే కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తారు.
ఇప్పటి వరకు ఆయన కామన్ ఎక్స్‌ప్లోరేషన్ సిస్టమ్స్ డెవలప్‌మెంట్ డివిజన్ తాత్కాలిక డిప్యూటీ అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్నారు. 2003 నుంచి అంతరిక్ష కార్యక్రమాల్లో పనిచేస్తున్నారు. ఆయన తల్లిదండ్రులు భారత్ నుంచి అమెరికా వలస వచ్చారు. క్షత్రియ విస్కాన్సిన్‌లోని బ్రూక్‌ఫీల్డ్‌లో పుట్టారు.
Mars and The Moon: చంద్రుడు, అంగారకుడిపై నీటి జాడలు!
Published date : 01 Apr 2023 01:08PM