Skip to main content

Usha Reddy: కన్సాస్‌ సెనేటర్‌గా ఉషా రెడ్డి

అమెరికాలోని కన్సాస్‌ రాష్ట్ర సెనేటర్‌గా భారతీయ అమెరికన్, విద్యావేత్త ఉషా రెడ్డి(57) బాధ్యతలు చేపట్టారు.

డెమొక్రాటిక్ పార్టీకి చెందిన ఆమె కాన్సాస్ రాష్ట్రంలోని డిస్ట్రిక్ట్ 22 సెనేటర్‌గా ఎన్నికయ్యారు. డెమోక్రాటిక్‌ పార్టీ తరఫున బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందంటూ ట్వీట్‌ చేశారు. ఆమె 2013 నుంచి మన్‌హాటన్‌ సిటీ కమిషన్‌గా కొనసాగుతున్నారు. మేయర్‌గా రెండుసార్లు ఎన్నికయ్యారు. నేషనల్‌ ఎడ్యుకేషన్‌ అసోసియేషన్‌ చాప్టర్‌ ప్రెసిడెంట్‌గానూ ఉన్నారు. ఉషారెడ్డి 8 ఏళ్లప్పుడు ఆమె కుటుంబం ఏపీలోని రాజమహేంద్రవరం నుంచి అమెరికా వెళ్లింది.

Monica Singh: తొలి సిక్కు మహిళా జడ్జిగా మన్‌ప్రీత్‌ మోనికా

Published date : 14 Jan 2023 03:20PM

Photo Stories