AC Charania: నాసా చీఫ్ టెక్నాలజిస్ట్‌గా భారతీయ అమెరికన్
వాషింగ్టన్‌లోని నాసా ప్రధాన కార్యాలయంలో అడ్మిస్ట్రేటర్ బిల్ నెల్సన్‌కు టెక్నాలజీ పాలసీ, ప్రోగ్రామ్‌ల ప్రధాన సలహాదారుగా చరానియా సేవలందించాల్సి ఉంటుంది. మరో భారతీయ అమెరికన్ సైంటిస్ట్ భవ్యా లాల్ స్థానంలో ఆయన జనవరి 3వ తేదీన కొత్త బాధ్యతలు చేపట్టారని నాసా తెలిపింది.
టెక్నాలజీ, పాలసీ, స్ట్రాటజీ సంబంధిత విషయాలపై ప్రధానంగా ఆయన పనిచేస్తారని పేర్కొంది. ఇప్పటివరకు రిలయబుల్ రోబోటిక్స్ సంస్థకు ప్రొడక్ట్ స్ట్రాటజీ వైస్‌ప్రెసిడెంట్‌గా ఉన్నారు. వర్జిన్ ఆర్బిట్‌లోనూ చరానియా పనిచేశారు. నాసాకు చెందిన ఫాస్ట్ ఫార్వర్డ్ ఇండస్ట్రీ గ్రూపునకు చరానియా నేతృత్వం వహించారు. లూనార్ ఎక్స్‌ప్లోరేషన్ అనాలిసిస్ గ్రూప్ కమర్షియల్ అడ్వైజరీ బోర్డు సభ్యుడు కూడా. చరానియా ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగంలో జార్జియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి బ్యాచిలర్, మాస్టర్స్ డిగ్రీ పొందారు.