Skip to main content

Krishna Chivukula: ఐఐటీ మద్రాస్‌కు రూ.228 కోట్ల విరాళం అంద‌జేసిన కృష్ణ చివుకుల!

ఐఐటీ-మ‌ద్రాస్‌కు పూర్వ విద్యార్థి, ఇండో-ఎంఐఎం వ్య‌వ‌స్థాప‌కుడు డాక్ట‌ర్ కృష్ణ చివుకుల రూ.228 కోట్ల విరాళంగా అంద‌జేశారు.
IIT-Madras donation function in Chennai  IIT Madras gets largest single donation of Rs.228 crore from alumnus Dr.Krishna Chivukula

ఆగ‌స్టు 6వ తేదీ చెన్నైలోని సంస్థ ప్రాంగ‌ణంలో జ‌రిగిన కార్య‌క్రమంలో ఈ మొత్తాన్ని అందించారు. ఈ నిధుల‌తో ఐదు ప‌థ‌కాల‌ను అమ‌లు చేయ‌నున్నారు. ఇది దేశంలోనే అతి పెద్ద విరాళ‌మ‌ని ఐఐటీ-మ‌ద్రాస్ డైరెక్ట‌ర్ వి.కామ‌కోటి అన్నారు. ఆయ‌న గౌర‌వార్థం అక‌డ‌మిక్ బ్లాక్‌కు కృష్ణ చివుకుల బ్లాక్‌గా పేరు పెట్టిన‌ట్టు ప్ర‌క‌టించారు. దేశంలోని ఏ యూనివర్సిటీకి కూడా ఒకేసారి ఇంత పెద్ద మొత్తం ఈలేదు.

మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబంలో జ‌న్మించి..
ఏపీలోని బాప‌ట్ల‌లో మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబంలో జ‌న్మించిన జ‌న్మించిన కృష్ణ చివుకుల. ఈయ‌న‌ 8వ తరగతి వరకు తెలుగు మీడియం పాఠశాలలో చదివాడు. ఐఐటీ-బాంబే, ఐఐటీ-మ‌ద్రాసులో ఏరో స్పేస్ ఇంజ‌నీరింగ్ చేశారు. హార్వర్డ్‌ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ డిగ్రీ అందుకున్నారు. తుముకూర్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేశారు. అనంత‌రం యూఎస్‌లోని ప్రముఖ హాఫ్‌మన్‌ ఇండస్ట్రీస్‌కి తొలి భారతీయ గ్రూప్‌ ప్రెసిడెంట్, సీఈవోగా సేవలందించారు. అప్పుడు ఆయన వయసు కేవలం 37 సంవ‌త్స‌రాలు మాత్ర‌మే. ఆ కంపెనీ నుంచి బయటకొచ్చి న్యూయార్క్‌ కేంద్రంగా 'శివ టెక్నాలజీస్​'ను నెలకొల్పారు. 

Anand Mahindra: స్కిల్ యూనివర్సిటీ చైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా

కృష్ణ చివుకుల 1997 సంవ‌త్స‌రంలో భారత్‌లో తొలిసారిగా మెటల్‌ ఇంజెక్షన్‌ మౌల్డింగ్‌ (MIM) సాంకేతికతను పరిచయం చేశారు.  పారిశ్రామిక‌వేత్త‌గా ఎదిగిన ఆయ‌న అమెరికాలో శివ టెక్నాల‌జీస్‌, బెంగుళూరులో ఇండో-మెట‌ల్ ఇంజ‌క్ష‌న్ మోల్డింగ్ ప్రారంభించారు. ఎంద‌రికో ఉద్యోగాలిచ్చారు. 2009 సంవ‌త్స‌రంలో ఆయన తిరుపతి జిల్లా రేణిగుంట కేంద్రంగా గౌరి వెంచర్స్‌ను స్థాపించారు.

Published date : 07 Aug 2024 02:59PM

Photo Stories