Skip to main content

John Amos: హాలీవుడ్ నటుడు జాన్ అమోస్ కన్నుమూత‌

హాలీవుడ్ ప్రముఖ నటుడు జాన్ అమోస్(84) కన్నుమూశారు.
Good Times Actor John Amos Dies Aged 84

వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన ఆగష్టు 21న తుది శ్వాస విడిచారు. అయితే ఈ విషయాన్ని ఆయ‌న చ‌నిపోయిన 50 రోజుల త‌ర్వాత కుటుంబ సభ్యులు అధికారికంగా అక్టోబర్ 1వ తేదీ ప్రకటించారు.

జాన్ అమోస్ 1939 డిసెంబర్ 27వ తేదీ జన్మించారు. 1971లో సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. ఆయన గుడ్ టైమ్స్, రూట్స్ వంటి ప్రసిద్ధ టెలివిజన్ సిరీస్‌లతో ప్రసిద్ధి పొందారు. గుడ్ టైమ్స్‌లో ఆయన అద్భుత నటన చేశారు.
 
జాన్ అమోస్ ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆటగాడిగా మొదలు పెట్టగా, ఆయన కాలం వెంటనే సినిమాల అవకాశాలు రావడంతో నటుడిగా మారారు. 50 సంవత్సరాల పాటు సక్సెస్ ఫుల్ యాక్టర్‌గా కొనసాగిన అమోస్, 50కి పైగా సినిమాలు, 100కు పైగా టెలివిజన్ సిరీస్‌లలో నటించారు. 2023లో వచ్చిన ది లాస్ట్ రైఫిల్ మ్యాన్ ఆయన చివరి సినిమా.

Vijaya Bharathi: ప్రముఖ రచయిత్రి విజయభారతి కన్నుమూత
 
"రూట్స్" మినీ సిరీస్‌లో కింటే పాత్రకు జాన్ ఎమ్మీ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయన పాత్రలకు ప్రముఖంగా "టీవి డాడ్" అని కూడా పిలవడం జరుగుతుంది.

Published date : 02 Oct 2024 05:09PM

Photo Stories