Skip to main content

Chief of the Army Staff: 29వ ఆర్మీ చీఫ్‌గా ఎవరు బాధ్యతలు చేపట్టారు?

General Manoj Pande

దేశ 29వ ఆర్మీ చీఫ్‌(చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌)గా ఏప్రిల్‌ 30న న్యూఢిల్లీలో జనరల్‌ మనోజ్‌ పాండే(60) బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణే ఏప్రిల్‌ 30న రిటైర్‌ కావడంతో ఆయన స్థానంలో జనరల్‌ పాండే బాధ్యతలు స్వీకరించారు. దీంతో కార్ప్స్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ విభాగం నుంచి ఈ అత్యున్నత పదవిని చేపట్టిన మొదటి వ్యక్తిగా మనోజ్‌ పాండే నిలిచారు. ఇప్పటి వరకు ఆర్మీ వైస్‌ చీఫ్‌గా ఆయన సేవలందించారు.

GK National Quiz: సుజలాం 2.0 ప్రచారాన్ని ప్రారంభించిన మంత్రిత్వ శాఖ?

చైనా, పాకిస్తాన్‌ సరిహద్దు ఉద్రిక్తతలు సహా దేశం భద్రతాపరమైన అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న వేళ జనరల్‌ పాండే చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌గా పగ్గాలు చేపట్టారు. ప్రస్తుతం ఆయన కీలకమైన చైనాతో సరిహద్దు ఉన్న ఈస్టర్న్‌ ఆర్మీ కమాండ్‌కు నేతృత్వం వహిస్తున్నారు. ఆర్మీ చీఫ్‌గాను, నావిక, వైమానిక దళాలతో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా థియేటర్‌ కమాండ్స్‌ను అమలు చేయాల్సి ఉంటుంది.

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన పాండే.. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలో శిక్షణ అనంతరం 1982లో కార్ప్స్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌లో చేరారు. సుదీర్ఘ కెరీర్‌లో పలు కీలక బాధ్యతలు చేపట్టిన ఆయనకు చైనా సరిహద్దులు, జమ్మూకశ్మీర్‌ సహా అన్ని రకాల ప్రాంతాల్లో పనిచేసిన అనుభవం ఉంది. దేశంలో ఏకైక త్రివిధ దళాల కమాండ్‌ ఉన్న అండమాన్‌ నికోబార్‌ కమాండ్‌కు చీఫ్‌గా కూడా వ్యవహరించారు.
NASSCOM: నాస్కామ్‌ చైర్‌పర్సన్‌గా ఎవరు నియమితులయ్యారు?​​​​​​​

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
దేశ 29వ ఆర్మీ చీఫ్‌(చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌)గా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : ఏప్రిల్‌ 30
ఎవరు    : జనరల్‌ మనోజ్‌ పాండే(60) 
ఎక్కడ    : న్యూఢిల్లీ
ఎందుకు : ఇప్పటివరకు ఆర్మీ చీఫ్‌గా ఉన్న జనరల్‌ ఎంఎం నరవణే  ఏప్రిల్‌ 30న రిటైర్‌ కావడంతో..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 01 May 2022 12:38PM

Photo Stories