France: యాంబిషన్ ఇండియా సదస్సులో పాల్గొననున్న మంత్రి?
ఐరాపా దేశం ఫ్రాన్స్ సెనేట్‌లో అక్టోబర్ 29న జరిగే ‘యాంబిషన్ ఇండియా బిజినెస్ ఫోరం 2021’ సదస్సులో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు పాల్గొననున్నారు. ఈ మేరకు సదస్సులో ప్రత్యక్షంగా పాల్గొని ప్రసంగించాల్సిందిగా ఫ్రాన్స్ ప్రభుత్వం కేటీఆర్‌ను ఆహ్వానించింది. తమ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ సారథ్యంలో జరిగే ఈ సదస్సుతో రెండు దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు బలోపేతం అవుతాయని కేటీఆర్‌కు పంపిన లేఖలో ఫ్రాన్స్ ప్రభుత్వం పేర్కొంది. కోవిడ్ తదనంతరం భారత్, ఫ్రాన్స్ సంబంధాల్లో అభివృద్ధి, భవిష్యత్తు నిర్మాణం అనే అంశంపై ప్రసంగించాలని కోరింది. ముఖ్యంగా ఈ సదస్సులో ఆరోగ్య రక్షణ, వాతావరణ మార్పులు, వ్యవసాయ వాణిజ్యం వంటి కీలక అంశాలపై చర్చ జరుగుతుందని వివరించింది.
చదవండి: రాష్ట్ర హైకోర్టు సీజేగా ప్రమాణం చేసిన న్యాయమూర్తి?
క్విక్ రివ్యూ :
ఏమిటి : యాంబిషన్ ఇండియా బిజినెస్ ఫోరం 2021 సదస్సులో పాల్గొననున్న రాష్ట్ర మంత్రి?
ఎప్పుడు : అక్టోబర్ 13
ఎవరు : తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు
ఎక్కడ : ఫ్రాన్స్ సెనేట్, పారిస్, ఫ్రాన్స్
ఎందుకు : ఫ్రాన్స్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్