Centre Extends SBI Chairman Dinesh Khara's Tenure: ఎస్.బి.ఐ చైర్మన్ పదవీ కాలం పొడిగింపు
Sakshi Education
భారతదేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా ప్రసిద్ధి చెందిన 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (SBI) చైర్మన్ 'దినేష్ ఖరా' (Dinesh Khara) పదవీ కాలాన్ని మరో 10 నెలలు పొడిగిస్తూ కేంద్ర నియామకాల క్యాబినెట్ కమిటీ (ACC) నిర్ణయం తీసుకుంది.
నిజానికి దినేష్ ఖరా అక్టోబర్ 2020లో మూడు సంవత్సరాల కాలానికి ఛైర్మన్‌గా ఎంపికయ్యాడు. అయితే ఇప్పుడు 2024 ఆగష్టు నెల 28 వరకు అతడే చైర్మన్ పదవిలో కొనసాగుతారు. ఆయన వయసు 63 సంవత్సరాలు వచ్చే వరకు ఆ పదవిలోనే ఉండనున్నారు.
LIC New MD: ఎల్‌ఐసీ కొత్త ఎండీగా ఆర్ దొరైస్వామి
1984లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబేషనరీ ఆఫీసర్‌గా కెరీర్ ప్రారంభించిన దినేష్ ఖరా.. ఆ తరువాత రిటైల్ క్రెడిట్, ఎస్ఎమ్ఈ అండ్ కార్పొరేట్ క్రెడిట్, డిపాజిట్ మొబిలైజేషన్, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ ఆపరేషన్, బ్రాంచ్ మేనేజర్ వంటి పదవుల్లో కొనసాగారు. ఆ తరువాత ఛైర్మన్‌గా ఎంపికయ్యారు. కాగా ప్రస్తుతం వచ్చే ఏడాది ఆగష్టు వరకు ఇదే పదవిలో కొనసాగుతారు.
PFC New Chairman, MD Parminder Chopra: పీఎఫ్‌సీ సీఎండీగా పర్మిందర్ చోప్రా
Published date : 07 Oct 2023 09:58AM