Skip to main content

CAG GC Murmu: భారత కాగ్‌ జీసీ ముర్ము ఏ అంతర్జాతీయ సంస్థ చైర్మన్‌గా ఎంపికయ్యారు?

CAG GC Murmu

సుప్రీం ఆడిట్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ అంతర్జాతీయ సంఘం (ఐఎన్‌టీఓఎస్‌ఏఐ) ప్రాంతీయ గ్రూప్‌లలో ఒకటైన అసెంబ్లీ ఆఫ్‌ ది ఆసియన్‌ ఆర్గనైజేషన్‌ (ఏఎస్‌ఓ ఆఫ్‌ ఎస్‌ఏఐ) చైర్మన్‌గా భారత్‌ కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) జీసీ ముర్ము ఎంపికయ్యారు. ఈ విషయాన్ని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (కాగ్‌) సెప్టెంబర్‌ 7న ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రకటన ప్రకారం...

  • 2024 నుంచి 2027 వరకూ జీసీ ముర్ము ఏఎస్‌ఓఎస్‌ఏఐ చైర్మన్‌ బాధ్యతల్లో ఉంటారు.
  • వియత్నాం రాజధాని హనోయ్‌లో జరిగిన ఏఎస్‌ఓఎస్‌ఏఐ 56వ గవర్నింగ్‌ బోర్డ్‌  జీసీ ముర్మును చైర్మన్‌గా ఎంచుకుంది. ఈ ఎంపికకు సెప్టెంబర్‌ 7న ఏఎస్‌ఓఎస్‌ఏఐ 15వ అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది.
  • ఏఎస్‌ఓఎస్‌ఏఐ 16వ అసెంబ్లీ సమావేశాన్ని 2024లో భారత్‌ నిర్వహిస్తుంది.

1979లో ఏర్పాటు...
సుప్రీం ఆడిట్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ అంతర్జాతీయ సంఘం 1979 ఏడాదిలో ఏర్పాటయ్యింది. ప్రారంభంలో 11 సుప్రీం ఆడిట్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ ఈ సంఘంలో సభ్యులుగా ఉండగా, ప్రస్తుతం ఈ సంఖ్య 47కు చేరింది. అసెంబ్లీ సమావేశాల్లో సుప్రీం ఆడిట్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ అంతర్జాతీయ సంఘం సభ్యులందరూ పాల్గొంటారు. మూడేళ్లకు ఒకసారి ఈ సమావేశం జరుగుతుంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
అసెంబ్లీ ఆఫ్‌ ది ఆసియన్‌ ఆర్గనైజేషన్‌ (ఏఎస్‌ఓ ఆఫ్‌ ఎస్‌ఏఐ) చైర్మన్‌గా ఎంపికైన వ్యక్తి?
ఎప్పుడు   : సెప్టెంబర్‌ 7
ఎవరు    : భారత్‌ కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) జీసీ ముర్ము 
ఎందుకు    : జీసీ ముర్ము ఎంపికకు ఏఎస్‌ఓఎస్‌ఏఐ 15వ అసెంబ్లీ ఆమోదముద్ర వేయడంతో...
 

Published date : 08 Sep 2021 07:39PM

Photo Stories