Source Code-My Beginnings: బిల్ గేట్స్ ఆత్మకథ.. 'సోర్స్ కోడ్-మై బిగినింగ్స్'

ఈ పుస్తకాన్ని.. మైక్రోసాఫ్ట్ స్థాపించిన 50 సంవత్సరాలు పూర్తి కావడంతో పాటు, తన తండ్రి శత జయంతి సంవత్సరం సందర్భంగా ఫిబ్రవరి 4వ తేదీ బిల్ గేట్స్ విడుదలచేశారు.
గేట్స్ తన ఈ స్వీయ చరిత్రలో తల్లిదండ్రులు, బాల్య స్నేహితుల ప్రభావం గురించి విపులంగా వివరించారు. ఈ పుస్తకంలో ఆయన పేర్కొన్న ఒక ముఖ్యమైన అంశం కుటుంబం యొక్క ప్రభావం గురించి. మానవ ఎదుగుదలపై కుటుంబం ఎలా ప్రభావం చూపిస్తుంది అనేది గేట్స్ తన ఆత్మకథలో చర్చించారు.
గేట్స్ తన తండ్రి గేట్స్ సీనియర్, సమాజానికి, కుటుంబానికి ఎంతో నిబద్ధత ఉంచేవారని చెప్పారు. ఆయన పిల్లలతో దయగా, ప్రేమగా వ్యవహరించేవారని కూడా చెప్పారు. అప్పుడు ఒక ముఖ్యమైన సంఘటనను గేట్స్ తన పుస్తకంలో భాగంగా వివరిస్తూ, డైనింగ్ టేబుల్ వద్ద ఆయన తండ్రి పైకి కోపం రావడం గురించి చెప్పారు.
India US Rrelations: భారత్‌తో అమెరికా వాణిజ్య సంబంధాల బలోపేతం
ఓసారి తండ్రితో వాదనలు జరుగుతుండగా, గేట్స్ సీనియర్ బిల్ గేట్స్ ముఖంపై గ్లాసులోని నీటిని చిమ్మారు. దీనిపై గేట్స్ స్పందిస్తూ "థాంక్స్ ఫర్ ది షవర్స్" అని చెప్పి, అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ సంఘటనను గేట్స్ తన తండ్రి శాంతం కోల్పోయినప్పుడు తన ప్రవర్తన వల్ల అతనికి అసహనం కలిగిన అనుభవంగా గుర్తు చేసుకున్నారు.
పుస్తకంలో.. గేట్స్ తన బాల్య స్నేహితుల ప్రభావం కూడా వివరించారు. ప్రశ్నించడం, చొరవగా మాట్లాడటం, సంతృప్తికరమైన జవాబు కోసం ప్రముఖ వ్యక్తులను ప్రశ్నించడం అనే అలవాట్ల వల్ల తన వ్యక్తిగత వృద్ధి చెందిందని గేట్స్ చెప్పారు.
☛ Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)