Aung San Suu Kyi: ఆంగ్‌సాన్ సూకీ జైలు శిక్ష 26 ఏళ్లకు పొడిగింపు
Sakshi Education
మయన్మార్ ప్రజాస్వామ్య నేత, నోబెల్ పురస్కార గ్రహీత ఆంగ్‌సాన్ సూకీ(77) జైలు శిక్షను ఆ దేశ కోర్టు 26ఏళ్లకు పొడిగించింది. డ్రగ్స్ తరలిస్తున్న వ్యాపారవేత్త నుంచి లంచం తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సూకీని ఆ కేసులో దోషిగా తేల్చింది. మూడేళ్ల శిక్ష విధించింది. ఇప్పటికే సూకీ అక్రమంగా వాకీటాకీలను దిగుమతి చేసుకున్నారని, కరోనా నిబంధనలను ఉల్లంఘించారని, అధికార రహస్యాలను బహిర్గతం చేశారని, దేశద్రోహంతోపాటు ఎన్నికల్లో అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ.. సైనిక ప్రభుత్వం కేసులు పెట్టగా.. కోర్టు 23ఏళ్ల జైలుశిక్ష విధించింది. తాజా శిక్షతో కలుపుకుంటే సూకీ ఏకంగా 26 ఏళ్లు జైలులోనే గడపాల్సి ఉంటుంది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 21 Oct 2022 01:29PM