Asaram Bapu: రేప్ కేసులో ఆశారాంకు జీవితఖైదు
Sakshi Education
స్వయం ప్రకటిత బాబా ఆశారాం బాపూను 2013నాటి అత్యాచారం కేసులో దోషిగా తేల్చి జీవితఖైదు విధిస్తూ గాంధీనగర్‌లోని అదనపు సెషన్స్ కోర్టు తీర్పు చెప్పింది.
ఈ మేరకు జనవరి 31న కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. బాధితురాలైన ఆశారాం మాజీ శిష్యురాలికి రూ.50,000 పరిహారం చెల్లించాలని జడ్జి డీకే సోనీ ఆదేశాలిచ్చారు. సూరత్‌కు చెందిన ఒక మహిళ మోతెరానిలోని ఆశారాం ఆశ్రమంలో శిష్యురాలిగా ఉండేది. 2001–2006 కాలంలో తనపై ఆశారాం పలుమార్లు అత్యాచారం చేశాడని 2013లో ఆమె కేసు వేసింది. ఈ కేసులోనే ఆయనను దోషిగా తేల్చిన కోర్టు తీర్పును జనవరి 31వ తేదీకి రిజర్వ్‌చేశారు. తీర్పును గుజరాత్ హైకోర్టులో సవాల్ చేస్తామని ఆశారాం తరఫు న్యాయవాదులు చెప్పారు. ఈ కేసులో ఆశారాం భార్య లక్ష్మీబెన్, ఆయన కుమార్తె, నలుగురు శిష్యులను నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. 2013లో రాజస్తాన్ ఆశ్రమంలో బాలికపై అత్యాచారం కేసులోనూ 81 ఏళ్ల ఆశారాంను దోషిగా తేల్చడంతో ఆయన ఇప్పటికే జోధ్‌పూర్ జైలులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నారు.
Naba Kisore Das: ఏఎస్సై కాల్పుల్లో గాయపడిన మంత్రి కన్నుమూత
Published date : 01 Feb 2023 04:18PM