Skip to main content

BPCL Chairman: బీపీసీఎల్‌ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి?

ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్న భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా అరుణ్‌ కుమార్‌ సింగ్‌ సెప్టెంబర్‌ 8న బాధ్యతలు చేపట్టారు.
Arun Kumar Singh-BPCL

సెప్టెంబర్‌ మొదటి వారంలో ఆయన నియామకానికి కేబినెట్‌ కమిటీ (నియామకాలు) ఆమోదముద్ర వేసింది. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ పరిశ్రమలో సింగ్‌కు 36 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. 2020 ఆగస్టులో డీ రాజ్‌కుమార్‌ పదవీ విరమణ నేపథ్యంలో ఆయన స్థానంలో 2021, నెలలో సింగ్‌ నియామకం జరిగింది. రాజ్‌కుమార్‌ స్థానంలో ఇప్పటివరకు కే పద్మాకర్‌ (మానవ వనరుల విభాగం డైరెక్టర్‌) సంస్థ సీఎండీ అదనపు బాధ్యతలు నిర్వహించారు.

ఫైనాన్స్‌ డైరెక్టర్‌గా రామకృష్ణ గుప్తా...
దేశంలో అతిపెద్ద రెండవ ఇంధన మార్కెటింగ్‌ కంపెనీ బీపీసీఎల్‌ కొత్త డైరెక్టర్‌ (ఫైనాన్స్‌)గా వేత్స రామకృష్ణ గుప్తా పదోన్నతి పొందారు. ప్రస్తుతం బీపీసీఎల్‌ సీఎఫ్‌ఓగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జూలై 31న పదవీ విరమణ చేసిన ఎన్‌. విజయగోపాల్‌ స్థానంలో ఈ నియామకం జరిగింది. బీపీసీఎల్‌లో తన మొత్తం 52.98 శాతం వాటాను విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి?
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 8
ఎవరు    : అరుణ్‌ కుమార్‌ సింగ్‌ 
ఎందుకు   : బీపీసీఎల్‌ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా డీ రాజ్‌కుమార్‌ పదవీ విరమణ నేపథ్యంలో...
 

Published date : 09 Sep 2021 07:05PM

Photo Stories