Attempt to Murder: జెడ్ కేటగిరీ భద్రతను తిరస్కరించిన నేత?
ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్-ఏఐఎంఐఎం) (All India Majlis-E-Ittehadul Muslimeen-AIMIM) పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై ఉత్తరప్రదేశ్‌లో హత్యాయత్నం జరిగింది. పశ్చిమ యూపీలో అసెంబ్లీ ఎన్నికలు ప్రచారంలో పాల్గొని, జనవరి 3న ఢిల్లీకి తిరిగివస్తుండగా హపూర్–ఘజియాబాద్ మార్గంలో ఛిజార్సీ టోల్‌ప్లాజా సమీపంలో ఒవైసీ కారుపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదు. తనను లక్ష్యంగా చేసుకొని సాగించిన కాల్పుల ఉదంతంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని ఎన్నికల సంఘానికి(ఈసీ) ఒవైసీ విజ్ఞప్తి చేశారు. అసదుద్దీన్ ఒవైసీపై కాల్పులు జరిపిన వ్యక్తిని అరెస్టు చేశామని, అతడి వద్ద నుంచి పిస్తోల్ స్వాధీనం చేసుకున్నామని ఉత్తరప్రదేశ్ అదనపు డీజీపీ(శాంతిభద్రతలు) ప్రశాంత్ కుమార్ చెప్పారు.
జెడ్ కేటగిరీ భద్రత వద్దు: ఒవైసీ
యూపీ కాల్పుల నేపథ్యంలో అసదుద్దీన్ ఒవైసీకి జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించగా ఆయన దాన్ని తిరస్కరించారు. తనపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని జనవరి 4న లోక్‌సభలో కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ‘‘నాకు జెడ్ కేటగిరీ రక్షణ వద్దు. ఆంక్షలతో కూడిన జీవితం గడపడం నాకు నచ్చదు’’ అని పేర్కొన్నారు.
జెడ్ కేటగిరీ అంటే..
- ప్రధానికి రక్షణ కల్పించే ఎస్‌పీజీని పక్కన పెడితే జెడ్ ప్లస్ తర్వాత మన దేశంలో రెండో అత్యున్నత స్థాయి భద్రత జెడ్ కేటగిరీ
- అధిక ముప్పున్న నాయకులు, ప్రముఖులకు కేంద్రం ఈ భద్రత కల్పిస్తుంది
- సీఆర్పీఎఫ్ కమాండోలు 24 గంటల పాటూ రక్షణగా ఉంటారు
- 16 నుంచి 22 మంది షిఫ్టుల్లో పని చేస్తారు
- రోడ్డు ప్రయాణాల్లో ఒక ఎస్కార్ట్, మరో పైలట్ వాహనం సమకూరుస్తారు
- ఈ భద్రతకు నెలకు రూ.16 లక్షలకు పైగా ఖర్చవుతుంది
చదవండి: యూజీసీ చైర్మన్‌గా నియమితులైన తొలి తెలుగు వ్యక్తి?
క్విక్ రివ్యూ :
ఏమిటి : జెడ్ కేటగిరీ భద్రతను తిరస్కరించిన నేత?
ఎప్పుడు : ఫిబ్రవరి 5
ఎవరు : ఏఐఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
ఎందుకు : ఆంక్షలతో కూడిన జీవితం గడపడం నచ్చదని..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్