Skip to main content

Mukarram Jah Bahadur: 8వ నిజాం ముకరంజా బహదూర్‌ కన్నుమూత

అనారోగ్యంతో కొన్నాళ్లుగా చికిత్స పొందుతున్న 8వ నిజాం రాజు మీర్‌ బర్కత్‌ అలీ ఖాన్‌ ముకరంజా బహదూర్‌ (89) జ‌న‌వ‌రి 14వ తేదీ టర్కీలోని ఇస్తాంబుల్‌లో కన్నుమూశారు.

ఆయన భౌతికకాయం జ‌న‌వ‌రి 17న‌ హైదరాబాద్‌ చేరుకుంటుందని నిజాం ట్రస్ట్‌ సభ్యులు ప్రకటించారు. త‌న‌ అంతిమ సంస్కారాలను హైదరాబాద్‌ మక్కా మసీదులోని అసఫ్‌జాహీ సమాధుల వద్ద నిర్వహించాలన్న ఆయన కోరిక మేరకు పార్థివ దేహాన్ని హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు. హైదరాబాద్‌ సంస్థానం ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ బహదూర్‌ మనుమడే ముకరంజా. 1933 అక్టోబర్‌ 6న ఫ్రాన్స్‌లో ఆయన జన్మించారు. డెహ్రాడూన్‌లో పాఠశాల విద్య, లండన్‌లో ఉన్నత విద్యాభ్యాసం చేశారు.  

Santokh Singh: గుండెపోటుతో కాంగ్రెస్‌ ఎంపీ కన్నుమూత
1967లో ఎనిమిదవ నిజాంగా..  

భారత యూనియన్‌లో హైదరాబాద్‌ చేరిన తర్వాత, ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ జనవరి 26, 1950 నుంచి అక్టోబర్‌ 31, 1956 వరకు రాష్ట్ర రాజ్‌ ప్రముఖ్‌గా పనిచేశారు. ఫిబ్రవరి 1967లో ఆయన మరణానంతరం ఏప్రిల్‌ 6, 1967లో ఎనిమిదవ అసఫ్‌ జాహీగా ముకరంజాకు పట్టాభిషేకం చేశారు. నిజాం చారిటబుల్‌ ట్రస్ట్, ముకరంజా ట్రస్ట్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ అండ్ లెర్నింగ్‌కు ముకరంజా చైర్మన్‌గా వ్యవహరించారు. ఏడో నిజాం వారసుడిగా భారీ సంపదను ముకరంజా వారసత్వంగా పొందారు. కాగా, మక్కా మసీదులోని అసఫ్‌జాహీ సమా ధుల ప్రాంగణంలో ముకరంజా ఖననం కోసం నిజాం ట్రస్టు సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. జ‌న‌వ‌రి 17న‌ ముకరంజా భౌతికకాయాన్ని ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తీసుకు వచ్చి, 18న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు చౌమహాల్లా ప్యాలెస్‌లో ఆయన పార్థివ దేహాన్ని సందర్శించడానికి ప్రజలను అనుమతించనున్నారు.  

వీక్లీ కరెంట్ అఫైర్స్ (వ్యక్తులు) క్విజ్ (17-23 డిసెంబర్ 2022)

 

Published date : 17 Jan 2023 12:51PM

Photo Stories