Pradhan Mantri Awas Yojana: పీఎంఏవై–జీను ఎప్పటి వరకు పొడిగించారు?
ఇంకా 155.75 లక్షల గృహాలను నిర్మించాల్సి ఉన్నందున ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ(పీఎంఏవై–జీ)ను మరో మూడు సంవత్సరాలు అంటే 2024 మార్చి 31దాకా పొడిగిస్తూ తాజాగా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మొత్తంగా గ్రామీణప్రాంతాల్లో 2.95 కోట్ల పక్కా ఇళ్లు నిర్మించాలని గతంలో లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇంకా నిర్మించాల్సిన ఇళ్ల కోసం రూ.2,17,257 కోట్లు ఖర్చుకానుంది. కేంద్రం రూ.1,25,106 కోట్లు, రాష్ట్రాలు రూ.73,475 కోట్ల ఆర్థికసాయం చేయనున్నాయి.
ఆనకట్టల భద్రత బిల్లుకు పార్లమెంట్ ఆమోదం
దేశంలో నిర్దేశించిన ఆనకట్టల భద్రత కోసం జాతీయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. కొన్ని సవరణలతో రాజ్యసభ డిసెంబర్ 2న ఆమోదించిన ఈ బిల్లుకు డిసెంబర్ 8న లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఆకస్మిక విపత్తులను నివారించేలా ఆనకట్టలపై నిరంతర నిఘా, పర్యవేక్షణ, తనిఖీ, నిర్వహణకు అవసరమైన నిబంధనలతో రూపొందించిన ఈ బిల్లు రాష్ట్రపతి ఆమోద ముద్ర తర్వాత చట్టంగా మారుతుంది.
చదవండి: ఏ రెండు నదుల అనుసంధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ(పీఎంఏవై–జీ)ను 2024 మార్చి 31వ తేదీ వరకు పొడిగించేందుకు ఆమోదం
ఎప్పుడు : డిసెంబర్ 8
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : ఇంకా 155.75 లక్షల గృహాలను నిర్మించాల్సి ఉన్నందున..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్