Supreme Court: అబార్షన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
అబార్షన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. చట్ట ప్రకారం సురక్షితమైన అబార్షన్ మహిళలందరూ చేసుకోవచ్చని అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. అవాంఛిత గర్భాన్ని తొలగించుకునేందుకు మహిళ వైవాహిక స్థితిని ప్రామాణికంగా పరిగణించలేమని తెలిపింది. పెళ్లితో సంబంధం లేకుండా అబార్షన్ చేయించుకునే హక్కు మహిళకు ఉందని తెలిపింది. పెళ్లి కాని మహిళలు కూడా అబార్షన్ చేయించుకోవచ్చని పేర్కొంది. గర్భం దాల్చిన 24 వారాల వరకు మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ(ఎంటీపీ) చట్టం,1971 ప్రకారం అబార్షన్ కు అనుమతినిచ్చింది. అదే విధంగా భర్త బలవంతం చేసినా అది అత్యాచారమే అవుతుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. వైవాహిక అత్యాచారం నేరంగా పరిగణించాలన్న సుప్రీంకోర్టు.. దాని ద్వారా కలిగే గర్భాన్ని కూడా అబార్షన్ చేసుకునే హక్కు మహిళలకు ఉందని తెలిపింది. ప్రతి భారతీయ మహిళకు తనకు నచ్చినది ఎంచుకునే హక్కు ఉందని, కేవలం వివాహిత స్త్రీలే శృంగారం చేయాలని నిబంధన ఏమీ లేదని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP