INTERPOL General Assembly: 90వ ఇంటర్‌పోల్ జనరల్ అసెంబ్లీకి చిహ్నంగా కోణార్క్ ఆలయ రథ చక్రం
![INTERPOL General Assembly](/sites/default/files/images/2022/10/03/interpol-1664798729.jpg)
భారత్‌లో అక్టోబరులో జరగనున్న 90వ ఇంటర్‌పోల్ జనరల్ అసెంబ్లీకి చిహ్నం (లోగో)గా కోణార్క్ ఆలయ రథ చక్రాన్ని ఎంపిక చేశారు. చక్రానికి చుట్టూ భారత జాతీయ పతాకంలోని మూడు రంగులను వృత్తంలా ఏర్పాటు చేసి రూపొందించిన లోగోను జనరల్ అసెంబ్లీని నిర్వహిస్తున్న సీబీఐ ఇటీవల ఆవిష్కరించింది. కోణార్క్ ఆలయాన్ని సూర్యుడి రథం ఆకారంలో తొలిచిన విషయం తెలిసిందే. ఈ రథానికి 24 చక్రాలు ఉంటాయి. ఒక్కో చక్రంలో 16 ఆకులు ఉంటాయి. వారంలో ఏడు రోజులు 24 గంటలూ ఇంటర్‌పోల్ విధుల నిర్వహణకు గుర్తుగా.. ఈ లోగోను ఎంపిక చేసినట్లు తెలిపారు. 195 దేశాల నుంచి అధికారులు ఈ సమావేశాలకు హాజరవుతారు. ఒక్కో సంవత్సరం ఒక్కో సభ్య దేశంలో ఈ అసెంబ్లీని నిర్వహిస్తున్నారు. 1997లో మన దేశంలో ఈ అసెంబ్లీ జరిగింది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
![Sakshi Education Mobile App](/sites/default/files/inline-images/CAs_0.jpg)