Skip to main content

President Droupadi Murmu: యుద్ధ విమానంలో ప్ర‌యాణించిన రాష్ట్రపతి ముర్ము

భారత రాష్ట్రపతి, రక్షణ దళాల సుప్రీం కమాండర్‌ ద్రౌపదీ ముర్ము మొట్టమొదటిసారిగా ఏప్రిల్ 8వ తేదీ యుద్ధ విమానంలో ప్రయాణించారు.
President Droupadi Murmu flies sortie in Sukhoi-30 fighter jet

అస్సాంలోని తేజ్‌పూర్‌ భారత వైమానిక దళ స్థావరం నుంచి సుఖోయ్‌–30ఎంకేఐ రకం విమానంలో ఆమె ప్రయాణం అరగంటసేపు సాగింది. 106వ స్క్వాడ్రన్‌ కమాండింగ్‌ ఆఫీసర్, గ్రూప్‌ కెప్టెన్‌ నవీన్‌ కుమార్‌ తివారీ ఆ విమానాన్ని నడిపారు. ఫ్లయింగ్‌ సూట్‌ ధరించిన రాష్ట్రపతి విమానం ఎక్కబోయే ముందుగా హంగార్‌ వద్ద వేచి ఉన్న జర్నలిస్టుల వైపు చేతులు ఊపారు. కాక్‌పిట్‌లో కూర్చున్న రాష్ట్రపతికి మహిళా అధికారి ఒకరు హెల్మెట్‌ తొడిగి, అవసరమైన సాంకేతికపరమైన ఇతర జాగ్రత్తలు పూర్తి చేశారు. 

Rahul Gandhi: రాహుల్ గాంధీపై అనర్హత వేటు.. లోక్‌స‌భ స‌భ్య‌త్వం ర‌ద్దు

విమానం సముద్రమట్టానికి 2 కిలోమీటర్ల ఎత్తులో గంటకు 800 కిలోమీటర్ల వేగంతో బ్రహ్మపుత్ర లోయమీదుగా ప్రయాణించింది. ప్రయాణం చాలా మంచిగా సాగిందని అనంతరం ఆమె మీడియాతో అన్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌ తమదేనంటూ చైనా వివాదం సృష్టిస్తున్న సమయంలో సరిహద్దు రాష్ట్రం అస్సాంలో ఆమె పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ముర్ము ఈ ఏడాది మార్చిలో దేశయంగా తయారైన విమానవాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను సందర్శించారని రాష్ట్రపతి భవన్‌ గుర్తు చేసింది.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (అవార్డ్స్) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)

 

Published date : 10 Apr 2023 05:56PM

Photo Stories