PM Modi: సరయు నహర్ ప్రాజెక్టును ఏ రాష్ట్రంలో నిర్మించారు?
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, బలరాంపూర్ జిల్లాలో రూ.9,800 కోట్లతో నిర్మించిన సరయు నహర్ జాతీయ ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్రమోదీ డిసెంబర్ 11న జాతికి అంకితం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్, శ్రావస్తి, బలరాంపూర్, గోండా, సిద్ధార్థనగర్, బస్తి, సంత్‌కబీర్ నగర్, గోరఖ్‌పూర్, మహారాజ్‌గంజ్ జిల్లాల్లోని 6,200 గ్రామాలకు చెందిన 29 లక్షల రైతుల 14 లక్షల హెక్టార్ల భూమిని సాగులోకి తెచ్చేందుకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టు ద్వారా ఘఘర, సరయు, రప్తి, బన్‌గంగా, రోహిణి నదులను అనుసంధానం చేశారు.
వాస్తవానికి ఈ ప్రాజెక్టు 1978లో ప్రారంభమైనా, అనేక అవాంతరాల కారణంగా నాలుగు దశాబ్దాలయినా అసంపూర్తిగానే మిగిలిపోయింది. చివరికి, 2016లో ఈ ప్రాజెక్టును ప్రధానమంత్రి కృషి సించాయీ యోజనలో చేర్చి సుమారు రూ.4,600 కోట్లను ఖర్చు చేసి ఎట్టకేలకు పూర్తి చేశారు.
చదవండి: పీఎంఏవై–జీను ఎప్పటి వరకు పొడిగించారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : సరయు నహర్ జాతీయ ప్రాజెక్టు ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 11
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : బలరాంపూర్ జిల్లా, ఉత్తరప్రదేశ్
ఎందుకు : ఉత్తరప్రదేశ్‌లోని 14 లక్షల హెక్టార్ల భూమిని సాగులోకి తెచ్చేందుకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్