PM Modi: తాజాగా ఎన్నో విడత పీఎం–కిసాన్ నిధులను విడుదల చేశారు?
2022, జనవరి 1న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం–కిసాన్) పథకం పదో విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. పీఎం–కిసాన్ పదో విడత నిధుల విడుదలలో భాగంగా మొత్తం 10.09 కోట్ల రైతులకు పంపిణీ చేసేందుకు రూ.20,946 కోట్లు విడుదల చేశారు. పీఎం–కిసాన్ కింద అర్హులైన రైతు కుటుంబానికి కేంద్రం ఏటా రూ.6,000 నగదు సాయం చేస్తోంది. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో ఇస్తారు. 2019 బడ్జెట్ సందర్భంగా పీఎం–కిసాన్ పథకాన్ని ప్రారంభించారు. ఇప్పటిదాకా మోదీ సర్కార్ మొత్తంగా రూ.1.8 లక్షల కోట్ల నిధులను రైతులకు పంపిణీ చేసింది.
వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట
కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ, కశ్మీర్‌లోని రియాసి జిల్లా, కత్రాలో ఉన్న ప్రఖ్యాత వైష్ణోదేవి మందిరంలో 2022, జనవరి 1న తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 12 మంది మరణించగా, పదహారుమంది గాయాలపాలయ్యారు. జమ్మూకు 50 కిలోమీటర్ల దూరంలోని త్రికూట్ పర్వతాల్లో నెలకొన్న ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది వస్తారు. ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని అధిక రద్దీ ఏర్పడింది. ఈ రద్దీ పెరిగి తొక్కిసలాటగా మారింది.
చదవండి: తౌక్టే తుపానుతో దెబ్బతిన్న రాష్ట్రం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం–కిసాన్) పథకం పదో విడత నిధులు విడుదల
ఎప్పుడు : జనవరి 1
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు : రైతులకు ఆర్థికసాయం అందించేందుకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్