Sansad TV: లోక్‌సభ, రాజ్యసభ టీవీలను విలీనం చేసి కొత్తగా ఏర్పాటు చేసిన టీవీ?
అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. సంసద్ టీవీ అనే ఈ కొత్త మీడియా దేశ పార్లమెంటరీ వ్యవస్థలో కొత్త అధ్యాయం అని అన్నారు. పార్లమెంటులోని కంటెంట్‌ని (విధానపరమైన నిర్ణయాలను) ప్రజలకు చేరవేసే కనెక్ట్ (మీడియా) ఈ ఛానెల్ అని అభివర్ణించారు. మన దేశంలో ప్రజాస్వామ్యమంటే రాజ్యాంగం, ఆర్టికల్స్ కాదని, అదొక జీవన ప్రవాహమని వ్యాఖ్యానించారు.
సీఈవోగా రవి కపూర్...
సంసద్ టీవీ సీఈవోగా రిటైర్డు ఐఏఎస్ అధికారి రవి కపూర్‌ను 2021, మార్చి 1వ తేదీ నుంచి ఏడాది కాలానికి నియమిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ ఒక సర్క్యులర్ జారీ చేసింది. రెండు చానెళ్లు విలీనం అయినప్పటికీ లోక్‌సభ, రాజ్యసభ కార్యక్రమాలను ఇప్పటివరకు మాదిరిగానే ప్రసారం చేస్తాయని, సంయుక్త సమావేశంలో ఒకే వేదికపై పనిచేస్తాయని రెండు సభల సెక్రటేరియట్ అధికారులు వివరించారు.
చదవండి: హిందీని అధికార భాషగా ఎప్పుడు ప్రకటించారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : లోక్‌సభ టీవీ, రాజ్యసభ టీవీలను విలీనం చేసి కొత్తగా ఏర్పాటు చేసిన సంసద్ టీవీ ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 15
ఎవరు : రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : పార్లమెంట్ ఉభయ సభల కార్యకలాపాలను ప్రత్యక్షప్రసారం చేసేందుకు వీలుగా కొత్తగా...