PM Modi: కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు మొదటి దశ ప్రారంభం
ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 13న తన నియోజకవర్గం వారణాసిలో శ్రీ కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్ ప్రాజెక్టు మొదటి దశను ప్రారంభించి, ప్రజలకు అంకితం చేశారు. రూ.399 కోట్లతో నిర్మించిన మొదటి దశ ప్రాజెక్టులో భాగంగా యాత్రి సువిధా కేంద్రాలు, టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్, వేదిక్ కేంద్ర, ముముక్షు భవన్, భోగ్‌శాల తదితర 23 భవనాలను మోదీ ప్రారంభించారు. నగరంలో పర్యాటకరంగానికి ఊపు తేవడమే లక్ష్యంగా కాశీ విశ్వనాథ్ ఆలయ విస్తరణ, పునరుద్ధరణ కోసం ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ చేసింది.
ఎన్‌డీపీఎస్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టెన్సెస్ సవరణ చట్టం–2021(ఎన్‌డీపీఎస్)కు లోక్‌సభ డిసెంబర్ 13న ఆమోదం తెలిపింది.
చదవండి: ఎస్సీ/ఎస్టీ చట్టం అమలుకు అందుబాటులోకి రానున్న హెల్ప్‌లైన్?
క్విక్ రివ్యూ :
ఏమిటి : శ్రీ కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్ ప్రాజెక్టు మొదటి దశ ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 13
ఎవరు : భారత ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : వారణాసి, వారణాసి, ఉత్తరప్రదేశ్
ఎందుకు : నగరంలో పర్యాటకరంగానికి ఊపు తేవడమే లక్ష్యంగా..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్