Skip to main content

PM Modi: కేరళ కలల ప్రాజెక్టు.. కొచ్చిన్‌ వాటర్‌ మెట్రో

PM Modi to flag off India's first Water Metro in Kochi

దేశంలో తొలిసారిగా నీటిపై నడిచే మెట్రో సర్వీస్‌ అందుబాటులోకి రానుంది. కొచ్చిన్‌ వాటర్‌ మెట్రో సర్వీస్‌ పేరుతో కేరళ ప్రభుత్వం ఈ రవాణా సేవలను అందుబాటులోకి తీసుకు వస్తోంది. ప్రధాని మోదీ ఏప్రిల్‌ 25న ఈ వాటర్‌ మెట్రోను జాతికి అంకితం చేశారు. దక్షిణాసియాలో తొలి వాటర్‌ మెట్రో ఇదేనని కేరళ సీఎం పినరయి విజయన్‌ పేర్కొన్నారు. కొచ్చిన్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌ దీని నిర్వహణ బాధ్యతలను చూస్తుంది. ఈ మెట్రో సర్వీస్‌లో బ్యాటరీ సాయంతో నడిచే 78 ఎలక్ట్రిక్‌ హైబ్రిడ్‌ బోట్లు ఉంటాయి. వీటి కోసం 38 టెర్మినళ్లు నిర్మించారు. కొచ్చిన్‌ చుట్టుపక్కల ఉండే 10 ద్వీపాలను కలుపుతూ.. ఈ వాటర్‌ మెట్రో రాకపోకలు సాగిస్తుంది. రూ.1,136.83 కోట్ల వ్యయంతో కేరళ రాష్ట్ర ప్రభుత్వం, జర్మనీకి చెందిన ఫండింగ్‌ సంస్థ కేఎఫ్‌ డబ్ల్యూ కలిసి సంయుక్తంగా ఈ ప్రాజెక్టు చేపట్టాయి. ఇందులో ఏసీ, వైఫై సౌకర్యం ఉంటాయి. ఒక్కో బోటులో 50 నుంచి 100 మంది ప్రయాణించవచ్చు. ఇవి గంటకు 15 నుంచి 22 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 09 May 2023 06:34PM

Photo Stories