Central Vista Project: సెంట్రల్ విస్టాలోని డిఫెన్స్ కాంప్లెక్స్‌లను ఏ శాఖ ఆధ్వర్యంలో నిర్మించారు?
ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా కస్తూర్బాగాంధీ మార్గ్, ఆఫ్రికా అవెన్యూలో నిర్మించిన రెండు నూతన బహుళ అంతస్తుల రక్షణ శాఖ కార్యాలయ కాంప్లెక్స్(డిఫెన్స్ ఆఫీసు కాంప్లెక్స్)లను ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 16న ప్రారంభించారు. ఇక్కడ 7,000 మందికిపైగా రక్షణ శాఖ, సైనిక దళాల ఉద్యోగులు పని చేయనున్నారు. ఢిఫెన్స్ ఆఫీసు కాంప్లెక్స్‌లను కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో నిర్మించారు. నిధులు, వనరులను రక్షణ శాఖ సమకూర్చింది. వీటితో 9.60 లక్షల చదరపు అడుగుల్లో ఆఫీసు స్పేస్ అందుబాటులోకి వచ్చింది.
సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ కింద...
ప్రస్తుత పార్లమెంట్‌కు దగ్గరోనే సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కింద కొత్త పార్లమెంట్ భవనాలను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఒక కొత్త పార్లమెంట్ భవనం, సెంట్రల్ సెక్రటేరియట్ భవనం నిర్మించడమే కాకుండా రాజ్‌పథ్ రోడ్‌ను మెరుగుపరుస్తున్నారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు చేపట్టిన ప్రాంతం ల్యూటెన్ ఢిల్లీలో ఉంది. ఈ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2020, డిసెంబర్ 10న శంకుస్థాపన చేశారు.
చదవండి: ఢిల్లీలో బుద్ధిమాంద్యం థెరపీ కేంద్రాన్ని ప్రారంభించిన సంస్థ?
క్విక్ రివ్యూ :
ఏమిటి : కస్తూర్బాగాంధీ మార్గ్, ఆఫ్రికా అవెన్యూలో నిర్మించిన రెండు నూతన బహుళ అంతస్తుల రక్షణ శాఖ కార్యాలయ కాంప్లెక్స్(డిఫెన్స్ ఆఫీసు కాంప్లెక్స్)ల ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 17
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా...