pending cases: దేశంలో పెండింగ్ కేసులు ఐదు కోట్లు...!
Sakshi Education
న్యాయస్థానంలో కేసు ఓడినవాడు అక్కడే ఏడిస్తే... గెలిచినవాడు ఇంటికి వచ్చి ఏడుస్తాడు అన్న నానుడి వినేవుంటారు. దేశంలో ఏటేటా పెండింగ్ కేసులు పెరిగిపోతూ ఉండడంతో కేసు విచారణ పూర్తికాక, తీర్పులు కూడా ఆలస్యమవుతూ వస్తున్నాయి.
ఈ క్రమంలో నిందితులతో పాటు బాధితులు తీర్పు కోసం చకోరాపక్షిలా వేచి చూడాల్సిన పరిస్థితి దేశంలో ఉంది.
ప్రస్తుతం దేశంలో ఐదు కోట్లకు పైగా కేసులు వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయని సాక్షాత్తు న్యాయశాఖమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ తెలిపారు. లోక్‌సభలో ఆయన వెల్లడించిన అంశాలు ఇలా ఉన్నాయి.
జులై 14 నాటికి హైకోర్టుల్లో మొత్తం పెండింగ్ కేసుల సంఖ్య 60,62, 953 కాగా.. దిగువ కోర్టుల్లో ఆ సంఖ్య 4,41,35,357గా ఉంది. దీనికి సంబంధించిన సమాచారం నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్‌లో అందుబాటులో ఉందని మేఘ్వాల్ తెలిపారు. ఇక అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో 69,766 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే రాజ్యసభలో ఆయన చెప్పిన లెక్క ప్రకారం.. జులై 20 నాటికి దేశవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో కలిపి పెండింగ్ కేసులు ఐదు కోట్ల మార్కు దాటాయని వెల్లడించారు.
Published date : 28 Jul 2023 07:03PM