Skip to main content

ULFA: ఉల్ఫాతో శాంతి ఒప్పందం

అస్సాంలోని మిలిటెంట్‌ సంస్థ ‘యునైటెడ్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ అసోం’(ఉల్ఫా)తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి ఒప్పందం చేసుకున్నాయి.
Amit Shah and Himanta Biswa Sharma oversee the crucial Assam peace accord  Peace treaty with ULFA  Union Home Minister Amit Shah at the historic peace agreement signing in Assam

ఆ రాష్ట్ర చరిత్రలోనే ఇది ఓ కీలక ఘట్టంగా నిలిచిపోనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మల సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా అమిత్‌ షా మాట్లాడుతూ.. అస్సాం ప్రజలకు ఇది మరపురాని రోజని చెప్పారు. ‘ఉల్ఫా హింస వల్ల అస్సాం ప్రజలు సుదీర్ఘకాలం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాదాపు 10,000 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇకపై ఉల్ఫాతో ఇబ్బందులు ఉండవు. ఇప్పుడు వారంతా ప్రజాస్వామ్య వాదులే’ అని అమిత్‌ షా పేర్కొన్నారు. కాగా, అస్సాంలో శాంతి స్థాపనకు కృషి చేయడం, అక్రమ వలసలను అడ్డుకోవడం, భూ హక్కులు లేని కొన్ని స్థానిక సామాజిక వర్గాలకు హక్కులు కల్పించడం, అస్సాం అభివృద్ధికి ఆర్థిక ప్యాకేజీ.. ఇలా పలు అంశాలను శాంతి ఒప్పందానికి ప్రాతిపదికగా తీసుకున్నారు.

చదవండి: Sainik School: దేశంలోనే తొలి బాలికల సైనిక్‌ స్కూల్‌

Published date : 09 Jan 2024 09:07AM

Photo Stories