Skip to main content

ఏపీలో వన్‌ స్టేషన్‌.. వన్‌ ప్రొడక్ట్‌

రైల్వేస్టేషన్‌ (విజయవాడపశ్చిమ): స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించే లక్ష్యంతో రైల్వే మంత్రిత్వశాఖ వన్‌ స్టేషన్‌–వన్‌ ప్రొడక్ట్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. అందులో భాగంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 35 రైల్వే స్టేషన్లలో 37 వన్‌ స్టేషన్‌–వన్‌ ప్రొడక్ట్‌ అవుట్‌లెట్లు ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
 One station One product ...in AP
One station One product ...in AP

రాష్ట్రంలో విజయవాడ స్టేషన్‌తో పాటుగా నెల్లూరు, రాజమండ్రి, ఏలూరు, ఒంగోలు, గుడివాడ తదితర ప్రధాన స్టేషన్లలో ఏర్పాటు చేసిన అవుట్‌లెట్‌ స్టాల్స్‌ ద్వారా స్థానిక చేతి వృత్తుల వారి జీవనోపాధి, సంక్షేమానికి ప్రధాన ప్రోత్సాహం క ల్పించారు.

సంప్రదాయ కలంకారి చీరలు, జనపనార ఉత్పత్తులు, అనుకరణ ఆభరణాలు, చెక్క హస్తకళలు, గిరిజన ఉత్పత్తులు, ఊరగాయలు, మసాలా పొడులు, అప్పడాలు వంటి స్థానిక వంటకాలు, షేల్‌ పెయింటింగ్స్, రైస్‌ ఆర్ట్స్‌ తదితర ఉత్పత్తులకు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు రైల్వే స్టేషన్లు అనుకూలమైన స్థలమని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ తెలిపారు. 

Published date : 17 May 2023 01:37PM

Photo Stories