Skip to main content

Noida Twin Towers Latest News : ట్విన్ టవర్స్‌ను ఎలా కూల్చారంటే..?

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో సూపర్‌టెక్‌ సంస్థ అక్రమంగా నిర్మించిన జంట భవనాల కూల్చివేశారు. ముంబైకి చెందిన ఎడిఫైస్‌ ఇంజనీరింగ్‌ సంస్థ ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు కూల్చి వేసింది.

ఈ కూల్చివేత నేపథ్యంలో సంబంధిత శాఖ అధికారులు స్థానికుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ సందర్భంగా ట్విన్‌ టవర్స్‌ కూల‍్చి వేతపై ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. 

➤ సుప్రీం కోర్ట్‌ ఆదేశాలతో  ఆగస్ట్ 8 నుంచి సెంట్రల్‌ బిల్డింగ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌, నోయిడా అధికారులు ఆధ్వర్యంలో ముంబైకి చెందిన ఎడిఫైస్‌ ఇంజనీరింగ్‌ సంస్థతో కూల్చివేత పనుల్ని ప్రారంభించారు.  
➤ జంట భవనాల కూల్చి వేత పనుల్ని పూర్తి చేసినట్లు నోయిడా పోలీస్‌ కమిషనర్‌ అలోక్‌ కుమార్‌ తెలిపారు. భవనాల్ని నేల మట్టం చేసేందుకు సహాయక చర్యల కోసం 560 మంది పోలీసులు, 100 రిజర్వ్‌ పోర్స్‌ సిబ్బంది, 4 క్విక్‌ రెస్పాన్స్‌ టీంలు రంగంలో​కి దిగినట్లు చెప్పారు. 
 ➤ ట్విన్‌ టవర్స్‌ను సెకన్ల వ్యవధిలో నేల మట్టం చేసేందుకు జంట భవనాల్లో 3,700 కేజీలకు పైగా  పేలుడు పదార్థాల్ని నింపారు.  ఇందుకోసం పిల్లర్స్‌కు సుమారు 7 వేల రంద్రాలు చేశారు. వాటర్‌ ఫాల్‌ టెక్నిక్‌తో ఒక్క బటన్‌ నొక్కగానే సెకన్ల వ్యవధిలో కూల్చేందుకు 20 వేల సర్క్యూట్‌ను సిద్ధం చేశారు.
➤ ప్రాజెక్ట్‌ ఇంజినీర్ల వివరాల ప్రకారం..  సూపర్‌టెక్‌ భవనాల్ని కూల్చే సమయం 9 సెకన్లు పడుతుంది. కూలిన వెంటనే సరిహద్దు ప్రాంతాల్లో 12 నిమిషాల పాటు దట్టమైన శిధిలా పొగ కమ్ముకుంటుంది. కూల్చివేతతో 55,000 నుంచి 80 వేల టన్నులు శిథిలాలు సేకరించే అవకాశం ఉండగా.. వాటిని తరలించేందుకు 3నెలల సమయం పట్టనుంది.

➤ కూల్చివేతల్లో ఒక్కో చదరపు అడుగుకు రూ.267 ఖర్చు అవుతుండగా.. 7.5 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణాలు కూల్చివేతకు రూ.20కోట్లు ఖర్చు అవుతోంది. ఈ భవనాల ప్రస్తుత విలువ అక్షరాల రూ.1,200 కోట్లు.

➤ ట్విన్ టవర్స్ వద్ద నో ఫ్లైయింగ్ జోన్ అమలు చేయడంతో పాటు చుట్టుపక్కల 500 మీటర్ల వరకు నిషేధిత ప్రాంతంగా ప్రకటించారు. అలాగే కూల్చివేసిన తర్వాత దుమ్ము, కాలుష్య స్థాయిలను పర్యవేక్షించడానికి ప్రత్యేక డస్ట్ మిషన్‌ను ఏర్పాటు చేశారు. బిల్డింగ్ కూలిన కొద్ది నిమిషాల్లోనే గాలిలో దుమ్ము, దూళిని క్లియర్ చేయనున్నారు.
➤ కూలే సమయంలో కొన్ని సెకన్ల పాటు 30 మీటర్ల రేడియస్‌ వరకు కంపించనుంది. పేలుడు 30 మీటర్ల  అధికారుల ప్రకారం, ఈ ప్రకంపనల పరిమాణం సెకనుకు దాదాపు 30 మిల్లీ మీటర్లు  ఉండవచ్చు. రిక్టర్ స్కేలుపై 0.4 తీవ్రతతో వచ్చిన భూకంపం ఎలా కంపిస్తుందో.. కూల్చి వేత సమయంలో నోయిడా టవర్స్‌ కంపిస్తాయి. ఇక  6 వరకు భూకంపాలను తట్టుకునేలా నిర్మించబడిందని అధికారులు తెలిపారు.
➤ ట్విన్‌ టవర్స్‌ చుట్టు పక్కల సుమారు 7 వేల కుటుంబాల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. తిరిగి వాళ్లు సాయంత్రం 5.30 గంటలకు రావొచ్చని అన్నారు.  కూల్చి వేతతో ఎలాంటి నష్టం జరగకుండా ఉండేలా స్థానిక నివాసాల్లో గ్యాస్‌, పవర్‌ సప్లయ్‌ నిలిపివేశారు. సాయంత్రం 4 గంటలకు కరెంట్‌, గ్యాస్‌ సదుపాయం అందుబాటులోకి రానుంది.
➤ సెక్టాకర్‌ 93ఏలో ట్విన్‌ టవర్స్‌ను నిర్మించిన ప్రాంతం చుట్టూ 450 మీటర్ల వరకు వాహనాల రాకపోకల్ని నిలిపివేయనున్నారు. బ్లాస్ట్‌ అనంతరం అంటే మధ్యాహ్నం 2.15 నుంచి 2.45 గంటల వరకు వాహనాల రాకపో కలు ఆగిపోనున్నాయి. 
➤ ట్విన్‌ టవర్స్‌ పక్కనే 8 మీటర్ల దూరంలో, మరికొన్ని 12 మీటర్ల దూరంలో భవనాలున్నాయి. దుమ్ము వ్యాప్తిని తగ్గించడానికి టవర్స్‌ను ప్రత్యేక వస్త్రంతో కప్పారు. ఈ ప్రాంతాన్ని ఒక నాటికల్ మైలు మేర నో ఫ్లై జోన్‌గా ప్రకటించారు.    
➤ రూ. 100 కోట్ల బీమా పాలసీ కింద కూల్చివేత ప్రక్రియ జరుగుతుంది . ఈ బీమా ట్విన్‌ టవర్స్‌ పక్కనే ఉన్న భవనాలకు ప్రమాదం జరిగితే.. నష్ట పరిహారంగా చెల్లించనున్నారు. ప్రీమియం, ఇతర ఖర్చులను సూపర్‌టెక్ భరించాలి. కూల్చివేత ప్రాజెక్ట్‌కు రూ. 20 కోట్ల కంటే ఎక్కువ ఖర్చవుతుంది. కూల్చివేతతో టవర్స్‌ నిర‍్మాణం కోసం ఉపయోగించిన ఉత్త ఇనుము వల్లే సుమారు రూ.50కోట్లకు పైగా నష్టం.
➤ ముంబైకి చెందిన ఎడిఫైస్ ఇంజినీరింగ్ అనే సంస్థ తొమ్మిదేళ్ల న్యాయపోరాటం తర్వాత రెండు టవర్లను కూల్చివేసే బాధ్యతను అప్పగించింది. ఎమరాల్డ్ కోర్ట్ సొసైటీ ప్రాంగణంలో నిబంధనలకు విరుద్ధంగా టవర్లను నిర్మించారని సుప్రీంకోర్టు గుర్తించిన తర్వాత వాటిని కూల్చేందుకు సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, నోయిడా అధికారులతో కలిసి పని చేసింది.
➤ ఒక్కో టవర్‌లో 40 అంతస్తులు నిర్మించాలని బిల్డర్ ప్లాన్ చేశారు. కోర్టు ఆదేశాల కారణంగా కొన్ని అంతస్తులు నిర్మించలేకపోయినా, పేలుడుకు ముందు కొన్ని మాన్యువల్‌గా విరిగిపోయాయి. టవర్లలో ఒకటైన అపెక్స్‌లో 32 అంతస్తులను కలిగి ఉంది. సెయానేలో 97ప్లాట్లు ఉన్నాయి. మరొకటి 29. అపెక్స్ 103 మీటర్ల పొడవు ఉండగా, సెయానే 97 వద్ద ఉంది. ప్లాన్ ప్రకారం 900+ ఫ్లాట్‌లు ఉన్నాయి, వీటిలో మూడింట రెండు వంతులు బుక్ చేయబడ్డాయి. మరికొన్నింటిని అమ్మేశారు. నిర్మాణంలో ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారికి వడ్డీతో సహా వాపసు ఇవ్వాలని డెవలపర్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది.

టవర్లను కూల్చివేసేందుకు..

Towers

9 ఏళ్ల పాటు సాగిన న్యాయ పోరాటం తర్వాత జంట టవర్లను కూల్చివేస్తున్నారు. సవరించిన బిల్డింగ్ ప్లాన్‌లో భాగంగా ఈ టవర్‌లు నిర్మాణానికి ఆమోదం లభించింది. ఆ ఆమోదంపై సూపర్‌టెక్ ఎమరాల్డ్ కోర్ట్ సొసైటీకి చెందిన  నలుగురు స్థానికులు  యూఎస్‌బీ తోతియా(80), ఎస్‌కే శర్మ(74), రవి బజాజ్‌ (65), ఎంకే జైన్‌ (59) నివాసితులు 2012లో కోర్టును ఆశ్రయించారు. మొదట్లో ఉద్యానవనం ఉన్న స్థలంలో టవర్లను నిర్మించినట్లు వారు తెలిపారు. అనుమతుల్లో అక్రమాలు వెలుగులోకి రావడంతో  కొందరు అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 2014లో అలహాబాద్ హైకోర్టు కూల్చివేతకు ఆదేశించగా..ఆ తర్వాత కేసు సుప్రీంకోర్టుకు వెళ్లింది. గత ఆగస్టులో, కోర్టు టవర్లను కూల్చివేసేందుకు మూడు నెలల సమయం ఇచ్చింది, కానీ సాంకేతిక సమస్యల కారణంగా అది ఒక సంవత్సరం పట్టింది.

Published date : 28 Aug 2022 07:21PM

Photo Stories