Skip to main content

Air Polluted City: అత్యంత కాలుష్య నగరంగా ముంబై

దేశంలో వాయుకాలుష్యం అత్యధికంగా ఉన్న నగరాల్లో ముంబై మొదటి స్థానంలో నిలిచింది.
mumbai first most air polluted city in country

అత్యంత కాలుష్య నగరంగా ఉన్న ఢిల్లీని దాటి తొలిస్థానంలో నిలవడం గమనార్హం. ఈ ఏడాది జనవరి 29 నుంచి ఫిబ్రవరి 8 వరకు భారత్‌లో వివిధ నగరాల్లో నమోదైన వాయు కాలుష్యాన్ని అంచనా వేయగా.. ముంబై తొలిస్థానంలో ఉందని స్విస్‌ ఎయిర్‌ ట్రాకింగ్‌ ఇండెక్స్‌(ఐక్యూ ఎయిర్‌) వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే ముంబై రెండోస్థానంలో ఉందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా టాప్‌10 నగరాల్లో ఢిల్లీ లేదని పేర్కొన్న ఈ సంస్థ.. తొలిస్థానంలో పాకిస్థాన్‌ లోని లాహోర్‌ నిలిచిందని పేర్కొంది.

                         >> Download Current Affairs PDFs Here

 

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 24 Feb 2023 05:51PM

Photo Stories