Skip to main content

Central Government: ఇకపై అమ్మాయిల కనీస వివాహ వయసు 21 ఏళ్లు..!

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం ఉన్న యువతుల కనీస వివాహ వయసు 18 ఏళ్లు.. ఇక నుంచి 21 ఏళ్లు కానుంది.
Minimum Marriage Age in India
Minimum Marriage Age in India

డిసెంబ‌ర్ 15వ తేదీన జరిగిన కేంద్ర కేబినెట్‌ భేటీలో యువతుల కానీస వివాహ వయసు ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఈ ఏడాది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సస్వాతంత్య్ర దినోత్సం సందర్భంగా యువతుల వివాహ వయసు పెంచుతామని తన ప్రసంగంలో పేర్కొన్న విషయం తెలిసిందే. తమ ప్రభుత్వం కుమార్తెలు, సోదరీమణుల ఆరోగ్యం గురించి నిరంతరం శ్రద్ధ వహిస్తుందని తెలిపారు. అదే విధంగా పోషకాహార లోపం నుంచి వారిని రక్షించాలని, అందులో భాగం‍నే వారికి సరైన వయసులో వివాహం చేయటం అవసరని పేర్కొన్న సంగతి తెలిసిందే.
మొదటి గర్భధారణ సమయంలో..
ప్రస్తుతం అబ్బాయిల వివాహ కనీస వయసు 21 ఏళ్లు, అమ్మాయిల వివాహ వయసు 18 ఏళ్లుగా ఉంది. అయితే బాల్య వివాహాల నిషేధ చట్టం, ప్రత్యేక వివాహాల చట్టం, హిందూ వివాహాల చట్టంలో మార్పులు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. జయ జైట్లీ నేతృత్వంలోని నీతి ఆయోగ్ టాస్క్‌ఫోర్స్  అమ్మాయిల కనీస వివాహ వయసు ప్రతిపాదనకు మద్దతు ఇచ్చింది. స్త్రీలకు మొదటి గర్భధారణ సమయంలో కనీసం 21 ఏళ్లు ఉండాలని టాస్క్‌ఫోర్స్ చెప్పడంతో ఈ ప్రతిపాదనపై డిసెంబర్‌ నెలలోనే సిఫారస్సులు సమర్పించారు.
 

Published date : 16 Dec 2021 12:50PM

Photo Stories